
ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటారు
కానీ మీరు వెళ్ళరు ...
ఏమిటో ఈ జనాలు తిట్టినా బాధే ,పొగిడినా బాధే..
నన్నెవరు పొగడరు,గుర్తించరు కనీసం కామెంట్లు కూడా ఇవ్వరు అని నేను బాధ పడుతుంటే
మా గొప్పల గురించి ప్రచారం చేసార్రా నాయనా అని గోల గోల చేస్తారెందబ్బా??
ఇంతకీ నేను మాట్లాడేది ఎ విషయం గురించంటే ఈ మధ్య మన బ్లాగుల్లో జరుగుతున్నా హాట్ టాపిక్ గురించే..
మొన్నన్యూ ఇయర్ సందర్భంగా మన తెలుగు బ్లాగుల్లో"గొప్ప" బ్లాగులు అనిపించిన వాటిని ఆంధ్రజ్యోతి పత్రికలో
ప్రచురించారట ఎవరో పాపం.కొత్త ఏడాదిలో సదరు బ్లాగర్ల "కళ్ళల్లో ఆనందం" చూడాలని..
కానీ మన బ్లాగర్ల వారు ఆంధ్రజ్యోతి వారి కళ్ళల్లో ఆనందం చూసే కాన్సెప్ట్ కి ఏ మాత్రం విలువ ఇవ్వకుండా..
వాళ్ళ మంచి మనస్సును అర్ధం చేసుకోకుండా మాకు చెప్పకుండా పేపర్ లో వేసేస్తారా అని గొడవ మొదలు పెట్టారు..
అయినా బ్లాగర్ పేరు పెట్టకుండా ఇది నేనే రాశానోచ్ అని వేసుకుంటే తప్పు కానీ
బ్లాగర్ల పేర్లు,వివరాలు, బ్లాగ్ URL తో సహా ప్రచురిస్తే తప్పేంటి అని??
అదే నేనైతేనా నాకు తెలిసిన పత్రికల్లో వాళ్ళు ఎవరైనా వుంటే ఏమి చేసైనా నా బ్లాగ్ గురించి రాయించి
పబ్లిసిటీ కొట్టేయ్యాలని చూస్తుంటే వీల్లెన్టండీ బాబూ ఫ్రీ గా వచ్చిన పబ్లిసిటీ గురించి ఇంత బాధపడిపోతున్నారు.
"అయినా మనలో మన మాట నాకు వాళ్ళని చూస్తుంటే పైకి బాధపడినట్లు కనిపించినా లోపల్లోపల
తెగ సంతోషపడిపోతున్నరేమో ఈ ప్రచారానికి అని ఒక చిన్న డౌట్ ఏమంటారు??"
వుంటాను మరి నా బ్లాగ్ ఎప్పుడు పడుతుందో పేపర్లో..???
నాకెప్పుడు 100 లు 100 ల మంది ఫాలోయర్స్ ఉంటారో???

