
ఇవాళ ఒక గొప్ప మనిషి గురించి చెప్పాలనిపించింది.
మా డ్రైవర్ రహీం భాయ్ చాలా మంచి మనషి మా కారు కొన్న దగ్గర నుండి అమ్మే దాక
( అదే లెండి మా డ్రైవర్ చేసిన "మంచి పనులకి" అమ్మాల్సి వచ్చింది పాపం చెడ్డ పనులు
అంటే ఫీల్ అవుతాడు కదా మళ్ళీ తెలిస్తే )
మా
టవేరాకి డ్రైవర్ కావాలని వెతుకుతుంటే ఎవరో చెప్తే తెలిసింది మా రహీం భాయ్ గురించి
ఇక అప్పటి నుండి మా కార్ కి డ్రైవరు, యజమాని అన్నీ మా రహీం భాయ్.
మా ఇంట్లో వాళ్ళందరం
అతన్ని సొంత ఇంటి మనిషిలా చూసుకునే వాళ్ళం..
నేను ఐతే భయ్యా అని నోరారా పిలిచేవాడిని.మా అమ్మ కొడుకా అనేది..
"అతి" అదే అత్యంత ప్రేమతో..ఇంకా రహీం భయ్యా నా కంటే ఎక్కువగా
కార్ గురించి శ్రద్ధ తీసుకునేవాడు.
కారు తీసుకెళ్ళి వాళ్ళింటి దగ్గరే పెట్టుకునే వాడు..
అయినా మనమేమి అనకూడదు కదా డ్రైవర్ అయినంత మాత్రాన అతను మనిషి కాదా???
ఇలా మా టవేరా జీవిత ప్రయాణం సాగుతుండగా మేము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు
రహీం భాయ్ కార్
లో సినిమా పెట్టేవాడు
డ్రైవింగ్ లో ఎందుకన్నా అని నేనంటే
"నీకు తెలియదులే తమ్ముడూ అమ్మ వాళ్ళు చూస్తారు
సరదాగా" అనే వాడు అత్యంత ఆప్యాయంగా
.అన్నయ్యే కదా అని ఊరకున్నాను.
ఇంకా సినిమా అయిపోయేంత వరకు నేను రోడ్డు వైపు, రహీం అన్నయ్య స్క్రీన్ వైపు చూస్తూ
వుండేవాళ్ళం.. మరి ఎదురుగా ఎయ్యన్న బండ్లు వస్తే ఆన్నని హెచ్చరిచాలి కదా మరి.
డ్రైవర్ కూడా మనలాంటి మనిషే కదా సినిమా చూడాలనిపిస్తుంది పాపం!
అన్నయ్య కదా ఏమీ అనకూడదు తప్పు !!
ఒకో రోజు నాకు నిద్ర వస్తుంది తమ్ముడూ నువ్వు కారు నడుపు అనే వాడు
సరే డ్రవర్లు కూడా మనలాంటి మనుషులే కదా వాళ్లకి మాత్రం నిద్ర రాదా అయినా
అన్నయ్యే కదా అని సరిపెట్టుకున్నాను..
అయినా డ్రైవర్ ని సొంత మనిషిలా చూసుకోవటం లో ఒక కిటుకు వుంది లెండి
ఈ డ్రైవర్ లు,పని మనషులు అమాయకులు పాపం.. కాస్త బాగా పలకరించి మనసులో
వాళ్ళంటే ఎంత హీన భావం ఉన్నా,,పై పై ప్రేమ ఒలకబోస్తే చాలు పది మంది చేసే పని ఒక్కరే చేస్తారు..
మనల్ని ఎన్నాళ్ళైనా వదిలి పోరు..
అలా కాకుండా వాళ్ళని హీనంగా చూస్తే నువ్వు కాకపొతే ఇంకొకడు అని పొతే ఆ పనులన్నీ
చేసుకోలేక చచ్చి వూర్కుంటాము అందుకే పని వాళ్ళని మన వాళ్ళలాగా చూసుకోవాలి.
వాళ్ళంటే చాలా అభిమానం ఉన్నట్లు నటించాలి..
మా కారు మా సొంతానికి ప్లస్ ట్రావెల్స్ కి బాగా ఉపయోగిస్తూ, జోరు మీదున్న రహీం భయ్యా
మమ్మల్నే కాదు... మా కార్ ని కూడా
సొంత దానిలా ఫీల్ అయ్యేవాడు. మేమే చెప్పాము కదా మరి
నువ్వు మా సొంత మనిషివి అని అదన్న మాట సంగతి.
అర్ధరాత్రి కిరాయిలు తిప్పుకునే వాడు. కారును సంవత్సరానికే పాత డొక్కు చేసి షెడ్డులో పడేసాడు
మా భయ్యా ..
ఈ దెబ్బతో నా లోని సొంత మనిషి మాయమయ్యి కార్ ఓనర్ బయటపడ్డాడు..
రహీం భయ్యా ఏందయ్యా కారును ఇట్టా చేసావు నమ్మి నీకప్పగిస్తే అని ఒక్క మాట
అన్నా అంతే రహీం భయ్యా మనసు గాయపదిందట పాపం..
అప్పటికి ఊరకున్న భయ్యా ట్రావెల్స్ కి బుక్ చేసుకున్న వాళ్ళని ఎక్కించుకుని
పోతా.. పోతా బండిని
ఒక్క జంప్ ఇచ్చి దూకించి ప్రయాణీకుల్ని బొర్లిగింతలు పెట్టించి యాక్సిడెంట్ చేసి తను మాత్రం
చాకచక్యంగా దూకేసాడు .. నా అదృష్టం బాగుంది ఎవరికీ ఏమీ కాలేదు పాపం.
అది అన్నయ్య చాకచక్యం అని తర్వాత తెలిసింది.
కారు దగ్గరికి వెళ్లి చూసిన నా దగ్గరికి వచ్చిన రహీం భయ్యా నీకు నా కంటే కారు ఎక్కువ కాదని
తెలుసు తమ్ముడూ అందుకే దూకేసా.. నీ సంగతి నాకు తెలుసు తమ్ముడూ నాకేమీ కానందుకు
నీకు చాలా సంతోషమని అంటూ నన్ను బిగికౌగిలి లో బంధించి ఒకటే ఏడుపు..
ఇది చూసిన ఆ చుట్టుపక్కల జనం ఆహా ఎంత మహానుభావుడు కారుకి అంత యాక్సిడెంట్ అయినా
డ్రైవర్ ని ఏమీ అనకుండా కౌగలించుకుని ఓదారుస్తున్నాడు ఎవరికీ ఉంటుంది ఇంత గొప్ప
మనసు,హృదయం ఈయనకి తప్ప అని ఒకటే పొగడ్తలు...
నాకు తెలుసు మా డ్రైవర్ భయ్యా నేను తిట్టిన దానికి నా మీద పగ తీర్చుకున్నాడని.
కానీ ఏమి చేస్తాం చెప్పండి కారు పొతే పోయింది లోకం దృష్టిలో ఇప్పుడు నేనెంత గొప్ప వాడిగా
పేరు వచ్చింది... ఆ పేరు,ప్రతిష్టల ముందు నా కారెంత??? అందుకే దాన్ని పాత ఇనప సామానుకి
అమ్మేసి అన్నీ మూసుకుని ఇంటికి పోయాను..
అదీ నా సొంత మనిషి నా డ్రైవర్ రహీం భయ్యా కదః..
అలా ఏదో అన్నయ్యే కదా అని ఊరకుంటే చాలా ఎక్కువ చేసేసాడు మా రహీమాన్ భయ్యా..
అప్పటి నుండి ఒక సంగతి మాత్రం తెలుసుకున్నాను అతి సర్వత్ర వర్జయేత్ అని..