ఎంత గండం తప్పిందిరో నాయనోయ్..
నిన్న క్రిస్టమస్ అని నాకున్న ఒక్కగానొక్క "ఫ్రెండ్" పిలిస్తే కక్కుర్తి పడి వాడి రూం కి వెళ్లాను..
మీకబ్బదం చెప్పెదేమున్దిలే గాని పార్టీ లో కొంచెం తీర్దం ఎక్కువే అయ్యిన్దనుకోండి...

మస్తుగా ఎంజాయ్ చేసి ,బై బై చెప్పి చిన్నగా ఇంటి దారి పడదామని సెల్లార్ లో పార్క్ చేసిన నా కార్ దగ్గరకు వెల్ల్తున్న నాకు మెల్లగా గల గలా జరా జరా అంటూ నా వైపే వస్తున్న శబ్దం వినిపించి,ఒక్క క్షణం గుండాగినంత పనైంది..ఈ మధ్య అసలే బ్లాగుల్లో రాస్తున్న దెయ్యాల కధలు చదివి చదివి ఉన్న నాకు,నా వెనక వచ్చింది ఏ బ్లాగులో దెయ్యమో అని కన్ఫర్మ్ అయిపొయింది..ఊ..ఊ..ఊ..ఊ..ఎవరికీ చెప్పను ఆ టైం లో నా మదిలో కలిగిన ఆలోచనలను?
నిన్న నేను పెట్టిన క్రిస్టమస్ టపానే నా చివరి టపా నా బ్లాగులో అనుకున్నా..
ఈ రోజు ఈ దెయ్యానికి నేనే క్రిస్టమస్ పలహారం కాబోతున్నానని తెలిసి కన్నీళ్లు ఆగలేదు..
ఎవరో టార్టాయిస్ చక్రం నా కల్లముందు తిప్పినట్టు,మా వాళ్ళు ,బ్లాగు మిత్రులు ఒక్కొకరు నా కల్ల ముందు కదిలారు..

బతికుంటే బలుసాకు తిని బతకొచు అని వెనక్కి తిరిగి చూడకుండా పరుగు అందుకున్నా నాకు
నా గుండె లబ్ డబ్ సౌండ్ నాకే వినపదతుంది.నా గుండె చప్పుడుని మించి వెనక గలా గలా సౌండ్ ఎక్కువయ్యింది.
బతుకు జీవుడా అంటూ కారు గీరు వదిలేసి,సెల్లార్ లో నుండి రోడ్డు మీదకి వచ్చి పడ్డ నాకు
ఒక్క నర పురుగు కూడా కనపడకపోవటం ఇంకాస్త గుండె దడ పెరిగింది.గుండె మొకాల్లలోకి జారింది.
అలా పరుగెత్తుతున్న నాకు సడెన్ గా వెనకే వస్తున్న సౌండ్ ఆగిపోయింది.
అప్పటిదాకా లేని ధైర్యం సౌండ్ ఆగగానే వచ్చింది..ఆ క్షణంలో ఒకటే జననం,ఒకటే మరణం గట్రా పాటలు
గుర్తు చేసుకుని ,ఒక్కసారిగా కూడా దీసుకున్న ధైర్యంతో అసలు నా వెనకాతల ఎం జరుగుతుందని వెనక్కి తిరిగి చూశాను..
మెల్లగా వెనక్కి తిరిగి చూసిన నాకు ఆశ్చర్య కరమైన దృశ్యం కనపడింది.
ఇంతకీ అదేంటంటే అక్కడ ఒక రెండు కుక్కలు మీటింగ్ వేస్కున్తున్నాయి.అవి రెండు నా వంకే చూస్తూ నా గురించే చెప్పుకున్తున్నట్లుగా నాకు అనుమానం వచ్చింది.
అనుమానం ఏమిటి నా బొంద.. అవి నిజంగా నే నా వైపు రావటం గమనించాను.అప్పుడు తెలిసింది ఆ గలా గలా సౌండ్ వెనక ఉన్న కారణం చీకట్లో మిలా మిలా మెరుస్తున్న ఆ కుక్క మెడలో ఉన్న గొలుసుదని ,కుక్క నడుస్తున్నప్పుడు ఆ మెడలో చైన్ కదిలి ఆ సౌండ్ వస్తుందని..

కుక్కలే కదా ఏమి చేస్తాయిలే అనుకున్నా..కానీ అందులో ఒక కుక్క వచ్చి నా పిక్క పట్టుకోబోయింది.
ఎలాగో తప్పుకున్న నేను మళ్ళీ పరుగందుకున్నాను.
ఈ లోపే ఎలా కబురందిందో ఏమో ఆ వీధిలో వున్న కుక్కల పరివారమంతా ఒక్క చోటికి నిమిషాల్లో చేరిపోయింది.
వాటిని చూసిన నా పై ప్రాణాలు పైనే పొయ్యాయి.'ఇంత బతుకు బతికి ఇంటెనకాల చచ్చినట్లు'
చివరికి కుక్కల
చేతుల్లో హత్యకు గురి అవుతానన్న అన్న భయంతో,ఈ వార్తని పదే పదే టీవీల్లో చూపిస్తారేమో అన్న సగం సిగ్గుతో చచ్చి పరుగు దీసిన నాకు ఇంతకీ ఆ కుక్కలు నా వెనకాల అంత పగబట్టినట్టుగా ఎందుకు వస్తున్నాయో అర్ధం కాలేదు.
ఈ గ్రామ సింహాల గొడవతో క్రిస్మస్ పార్టీ మత్తు వదిలిపోయి తేరుకున్న నాకు దగ్గరలో ఏమైనా ఆయుదాలున్నాయేమో అని చూసాను,ఒక తుంట
కర్ర కనపడింది. ఆ ఆయుధంతో ఆ కుక్కల అంతాన్ని చూడాలని మగధీర లాగా ఒక్క కుక్క కాదే ఇంకో వంద కుక్కలు వెంటబడండి మీ అంతం చూస్తా అన్న రేంజ్ లో వాటి వైపు ఒక చూపు విసిరా..

ఇంక వెళ్లి ఆ తుంట కర్ర తెచ్చుకుని కుక్కల మీద యుద్ధం చేయటానికి సన్నద్ధమయ్యి, ఆ కర్ర కోసం కిందికి వంగిన
నాకు నా జేబులో నుండి కిందికి పడిన వాటిని చూసి ఆశ్చర్యంతో నోరేల్లబెట్టిన నేనొక వైపు,
పిక్క
ట్టుకుని కరుస్తాయని భయపడ్డ కుక్కలు సొల్లు
కార్చుకుంటూ ఇంకోవైపు..
ఇంతకీ నా జేబులో నుండి కిందపడినవి ఏమిటనుకుంటున్నారు??
అప్పటిదాకా పీకలదాకా తిని,తాగి నా జేబులో ఏమి వేసుకున్టున్నానో కూడా తెలియకుండా
కార్ కీస్ , నా పర్స్ అనుకుని నేను జేబులో పెట్టుకున్న రెండు చికెన్ లెగ్ పీసులు.
అప్పటికి అర్ధం అయ్యింది కుక్కలు నా వెనక ఎందుకు పడ్డాయో..
అమ్మయ్య బ్రతుకు జీవుడా అనుకుని,చికెన్ ముక్కలతో సరిపెట్టుకుని,నా పిక్కల్ని వదిలేసిన నా ప్రియమైన
కుక్కలకి ధన్యవాదములు చెప్పి ఇంటి దారి పట్టాను..
అప్పుడే నా న్యూ ఇయర్ రిజల్యూషన్ తీసుకున్నాను ఏమని?
తీర్ధం పుచ్చుకోకూడదు అని అనుకుంటున్నారా??
కాదు కాదు ఈ సారి న్యూ ఇయర్ పార్టీలో జాగ్రత్తగా వ్యవహరించాలని...

అన్నట్టు టపాలో కొన్ని తప్పులు దొర్లినాయి. నిన్నటి తత్తరపాటు ఇంకా వదలని కారణంగా ఆ ప్రభావంతో
ఇలా జరిగింది ఏమీ అనుకోకండి.