హారం నిర్వాహకులూ పండగ చేసుకుంటున్నారా ???

5 కామెంట్‌లు

హారం నిర్వాహకులూ నా బ్లాగ్ హారం నుండి తీసేసి మీరు పండగ చేసుకుంటున్నారా వీళ్ళలాగా??
హారం నిర్వాహకులూ నేను చేసిన తప్పేమిటి నా బ్లాగును ఎందుకు హారం లో రాకుండా చేశారు??
నేనేమైనా ఆడవాళ్ళను అవమానిస్తూ బూతు కధలు రాశానా??
నా బ్లాగ్ లో కామెంట్ ఇచ్చిన ఆడవాళ్ళను అవమానించానా??


నేను చేసిన తప్పేమిటో నాకు తెలుసు
మీలో మీరు పోటుగాల్లమనుకునే కొందరు సీనియర్ బ్లాగర్ల భజన చేయక పోవటం
తప్పు మాట్లాడిన వాడిని తప్పు అని చెప్పటం..
ఇతర బ్లాగర్లతో కూడా తప్పు ఏమిటో చెప్పించటం అందుకే నా బ్లాగ్ ని హారం లో రాకుండా చేసారని నాకు తెలుసు.

అయినా నా మొహం హారమేమన్నా గిన్నీసు బుక్కా అందులో నా బ్లాగ్ పేరు రాలేదని ఫీల్ కావటానికి ..
అది కూడా కొంత మంది భజన పరులు చేరిన గుంపే కదా..
అందుకే మీకు భజన చేసిన ఆడ ,మగ బ్లాగర్లు మాత్రమే మీ హారం లో వుంటాయి.

హారం నిర్వాహకులూ హారం నుండి నా బ్లాగ్ తీసేయటానికి గల కారణం ఏమిటో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను.... చెప్తే సంతోషిస్తాను...

నా బ్లాగ్ హారం నుండి తీసేశారు కదా ఇంక సీనియర్ బ్లాగర్లందరూ పండగ చేసుకోండి
వీళ్ళ లాగా :):)


ఎవ్వరే నువ్వు నన్ను కదిపావు ...

0 కామెంట్‌లు

::: కవిత అనుకున్నారా ????
కవిత కాదు నాకు చాలా ఇష్టమైన పాట :::






సగం ముసలోడివి... నీకెందుకు బాబాయ్ యూత్ సినిమాలతో..

1 కామెంట్‌లు

మా బాబాయ్ కి పెళ్ళయ్యింది లైఫ్ లో కిక్కు దొబ్బింది.. వద్దురా సోదరా పెళ్ళంటే నూరేళ్ళ మంటరా అని నాగార్జున చెప్పిన మాట వినకుండా పెళ్లి చేసుకున్నాడు... పాములాంటోడు వావపాము అయ్యాడు పాపం..

ఎంతైనా వయసు మీద పడ్డాక పడ్డట్టే ఉండాలా??? వెనకటి రోజులు రమ్మంటే ఎలా వస్తాయి.. ఇప్పుడెల్లి యూత్ కి నచ్చే సినిమాలు చూస్తాను అంటాడు చూశాక మళ్ళీ అయ్యి బాగాలేవురా డబ్బులు దండగ అని ఏడుస్తాడు??

నేను చెప్పా బాబాయ్ నీకు వయసు మీద పడ్డ హీరోలు చేసే సినిమాలే కరెక్ట్ సినిమాలే చూడు.. ఇప్పుడు యూత్ లాంగ్వేజ్ నీకు అర్ధం కాదు,వాళ్ళ చేష్టలు నీకు వింతగా అనిపిస్తాయి అని ..అయినా నీకు ""తొడ రుద్దుకునే"" హీరోలు నచ్చుతారు కానీ ""మెడ రుద్దుకునే"" హీరోలు నచ్చరులే అని కూడా చెప్పా వింటావా?? వినవు ...

అయినా బాబాయ్ వయసు మీద పడ్డ నీలాంటోళ్ళ కోసమే కదా వయసు మీద పడ్డ బాబాయ్లు ,నాన్నలు హీరోలు ఎంతమంది లేరు?? అయినా ఊరందరిదీ ఒక దారైతే ఉలిపిరి కట్టేది ఇంకో దారి అన్నట్టు అందరూ గబ్బర్ సింగ్ సినిమా
బాగుంది అంటుంటే నీకెందుకు బాబాయ్ అంత కుళ్ళు??? ఎంత కులాభిమానమైనా ఇంత పనికిరాదు బాబాయ్ నీకు.

అందుకే శుభ్రంగా రేపెప్పుడో జీ టీవీలో రామరాజ్యం సినిమా వస్తది అది చూడు, నీకు అదే కరెక్టు..
అయినా గబ్బర్సింగ్ తో నీకెందుకు చెప్పు సగం ముసలోడివి .. తుపాకీ తూటాల సౌండ్ కి నీ ముసలి చెవులు పొతే మా పిన్నికి సావు వస్తది నిన్ను పిలవలేక జాగ్రత్త.

అప్పుడెప్పుడో పవన కళ్యాన్ ఖుషి నచ్చింది కానీ ఇప్పుడు నచ్చటం లేదు అంటే బాబాయ్ ఒక్కసారి నీది అప్పటి ఫోటో,ఇప్పటి నీ ఫోటో పక్క పక్కన పెట్టి సూసుకో నీకు నువ్వే చీదర పుట్టేటట్టు ఉండకపోతే చూడు..
అప్పట్లో బెల్బాటం ఫ్యాంట్ వేసుకుని ఉంటావు .. ఇప్పుడు కూడా అదే వేసుకుంటే నీ వెంట కుక్కలు పడవూ ఎవడో కేతి గాడు వచ్చాడని??

ఎప్పటి ట్రెండు అప్పటిదే బాబాయ్ నీకు ఫాలో అవటం వస్తే ఫాలో అవ్వు లేకపోతె నీలాగా కళ్ళ కింద కారీ బాగ్ లు పెట్టుకునే హీరోల సినిమాలు వచ్చినప్పుడే సినిమా చూడు, ముసలి హీరోల భజనే చెయ్యి సరేనా ...బాబాయ్ ఇంక ఉంటా..

మా "వేణు మోహన్" చిత్రలేఖన విన్యాసాలయ్యా .. జనానికి వచ్చే తిప్పలయ్యా...

39 కామెంట్‌లు

ఊహను రూపంగా మలచగల ఒకే ఒక సాదనం చిత్రలేఖనం. కళకు పరిమితులు లేవు. మానవ చరిత్ర, సాంప్రదాయాలు, జీవనశైలి, వ్యవస్థ ఇలా దేనినైనా ఆవిష్కరించి మానవుని అభివృద్దిలో కీలకమైనది చిత్రలేఖనం. ఇలాంటి అద్భుతమైన చిత్రాలను సృష్టించేవారిని చిత్రకారులు అంటారు.

చిత్రాలలో రకాలు --

రేఖా
చిత్రాలు ....

గీతలతో చిత్రించే అందమైన చిత్రాలు..

వ్యంగ్య చిత్రాలు (Cartoons) ....
మామూలు
రూపురేఖలను సాగదీస్తే వచ్చే బొమ్మలనే వ్యంగ్యచిత్రం (క్యారికేచర్) అంటారు. మొట్టమొదటి క్యారికేచర్ విక్టోరియా మహారాణి గీసిందనే కథ ప్రచారంలో వుంది. ఒకసారి చిత్రకారుడు విక్టోరియా చిత్రాన్ని గీస్తూ అర్థంతరంగా వదిలిపెట్టిన చిత్రానికి మహారాణి వికారంగా వుండే ముక్కుని సాగదీసినట్లుగా నాలుగు గీతలు గీసిందట. ఇది చూసిన చిత్రకారుడు పకాపకా నవ్వాడట.

నీటి
వర్ణ చిత్రాలు (Watercolor paintings)
నీటిలో కరిగే రంగులను ఉపయోగించి చిత్రించే చిత్రకళా విధానం (Watercolor painting).

తైల
వర్ణ చిత్రాలు (Oil paintings)
ఆరిపోయే గుణం కలిగిన నూనెను మీడియం గా ఉపయోగించి వేసే రంగుల చిత్రాలు.

నాకు తెలిసి గొప్ప చిత్ర కారులుగా పేరెన్నిక గన్న కొందరు చిత్రకారులు అజరామరంగా ప్రజల గుండెల్లో నిలిచిపోయే చిత్రాలను చిత్రీకరించారు.అందమైన వారి ఊహలను కాన్వాస్ మీదికి ఎక్కించి, చూపరులను ఆనందాశ్చర్యాలలో ముంచటం చిత్రకారుల చతురత.

భారత్
:
రాజా రవివర్మ
ఎమ్.ఎఫ్. హుస్సేన్
జిమిని రాయ్

మన తెలుగు నాట
దామెర్ల రామారావు
కౌతా ఆనందమోహనశాస్త్రి
కౌతా రామమోహనశాస్త్రి
అంట్యాకుల పైడిరాజు
బాపు
వడ్డాది పాపయ్య
వరాహగిరి వెంకట భాగీరథి
వరదా వెంకటరత్నం
జయదేవ్

ఇంకా ఎవరైనా వుంటే మీరు చెప్పొచ్చు..

అసలు కధ.............

ఇప్పుడింతకీ ఇప్పుడు నాకు చిత్రలేఖనం గురించి ఇంత సడెన్ గా ఎందుకు గుర్తొచ్చింది అంటారా??
అదొక పెద్ద కధ ... ఒక పెద్ద పీడ ( చీడ) కల (కళ)..
మా చిన్నప్పుడు మా ఇంటి పక్కన ఇళ్ళకి రంగులు వేసే పైంటర్ ఎల్లయ్య వుండే వాడు... వాడికో కొడుకు వాడి పేరే
"వేణు మోహన్".చిన్నప్పటి నుండి వాళ్ళ నాన్న ఇళ్ళకి పైంట్లు వేసి మిగిలిన రంగులు,
బ్రష్షులు ఓనర్లకి తెలియకుండా దొంగతనం గా తెచ్చుకునే వాడు ఇంటికి ... ఇంకేముంది వాటిని చూసిన మన వేణు మోహన్ కి పండగే పండగ.

మిగిలిన రంగుల్లో బ్రష్షు ముంచి ఎదురింటి.పక్కింటి గోడలమీద కుడ్య చిత్రాలు గీసి ఇళ్ళ వాళ్ళతో తన్నులు తినేవాడు వెధవ... వాళ్ళ నాన్న కూడా అరేయ్ నా కొడకా ఎందుకురా అట్లా జనాలతో తన్నులు తింటావు?? శుభ్రంగా నాఎమ్మటి అచ్చి (వచ్చి) గోడలకి సున్నాలు ఎయ్యటం నేచుకోరా అనేవాడు..కానీ వీడు వింటేనా???

ఎలాగోలా ITI పాసయ్యి రైలో డ్రైవర్గా ఉద్యోగం ఎలగాబెడతన్నాడు. అయినా కళ మీద ఆసత్తి పోలా మా వేణుమోహన్ కి ఎప్పటికైనా మంచి చిత్రకారుడని అయ్యి m.f హుసేన్,రవి వర్మ లాగా పైకి పోవాలని
పిచ్చి కోరిక పిచ్చోడికి. ( పైకంటే పైకి కాదండోయ్ :) )

ఇప్పుడింక ఆసక్తిలో భాగంగా రైలు డ్రైవర్ గదా రైలు నడుపుతా నడుపుతా వదిలేసి,బొమ్మలు గీస్తా వుంటే రెండు మార్లు జనాలు సావబోయ్యి బతికారంటా ... సస్పెండ్ చెయ్యాలనుకుని కూడా వెధవ వేణు మోహన్ గాడు తిండికి సస్తాడని జాలిపడి వుద్యోగం ఉంచారు పాపం పైవోళ్ళు..

ఇంకా వ్యంగ్య చిత్రాలు అయ్యేంటీ కారికేచర్లంట వాళ్ళ ఇంటి పక్కనోల్లయి,వాళ్ళ తోటి డ్రైవర్ల ని , ఆఫీసర్లని ఒక్కళ్ళని వదలకుండా ""అందరి మొహాలూ ఒకేలా""" ఉండేలా కారికేచర్లు గీసాడం
ట... ఆల్లంతా ఈడి ముందు ఆహా ఓహో అని మెచ్చుకుని,చాటున వీడి బొంద ఒక్కళ్ళ మొహమన్నా వాళ్ళ మోహంలో పోలికలున్నాయా అని నవ్వుకోలేక చచ్చారంట. వీడి పైన్టింగులకి ఇంకో ప్రత్యేకత ఎవరి బొమ్మ గీసినా మొహం ఒకేలా వుండటం :):)


ఇంక మొదలు పెట్టాడయ్యా పురాణ పాత్రలూ, దెయ్యాలూ,భూతాల బొమ్మలు అయ్యి చూసి వాడి పిల్లలకే దడుపు జొరం వచ్చిందంట ఇంట్లో వాడి పెళ్ళాం ఒకటే గోల నీ పాడు గాను ఏందిరా నీ పిచ్చి బొమ్మలు డబ్బులన్నీ కాగితాలకి,పెన్సిల్లకి తగలేస్తాన్నావు అని గోల గోల వీధంతా..

వీడు వేసే బొమ్మలు నిజంగా బాగుండకపోయినా వాడు పోయించే టీ నీళ్ళకి, వాడి పార్టీలకి వాడి చుట్టూ ఆడ,మగ ఫానులు చేరి వాడిని ఆహా ఓహో నీ అంత చిత్రకారుడు లేడని పొగడటం మొదలు పెట్టారు..
కొంతమందేమో పిచ్చి నాకొడుకు ఈడితో మనకెందుకులే ఏదో బాగుందని చెప్తే పోలా అని వాడి ముందు బాగా వేసావయ్యా బొమ్మలు అనే వాళ్ళు.ఇంక అంతే మన వేణు మోహన్ గాడి కళ్ళు నడినేత్తికేక్కాయి
నాకేంది నేను గొప్ప పైంటర్ ని అన్న అహంకారం వచ్చింది వాడికి..


ఎవరైనా పాపం ఏదో కొంచెం తప్పులున్నాయని చెప్తే చాలు వాళ్ళని నానా తిట్లు తిట్టి అవమానించేవాడు గాలి వెధవ లాగా..
పాపం మా బజార్లో ఒక పెద్దామె బొమ్మ ఇలా కాదయ్యా ఇంకోలాగా వేస్తె బాగుంటుందేమో అని ఏదో చిన్న మాట అన్నదంట .. అంతే వేణు మోహన్ గాడు ఆమెని పెద్ద మనిషి అని కూడా మర్యాద ఇవ్వకుండా వాడికి తగ్గ "మిఢతం బొట్ల" గాళ్ళ పేర్లు ఒక 3,4 పేర్లు చెప్పి వాళ్ళు చెప్తే నేను వింటా గానీ నువ్వెవరమ్మా చెప్పటానికి నువ్వేమన్నా గొప్ప పైంటర్ వా అని వెధవ వాగుడు వాగి ఆమెని బాధ పెట్టాడు పాపం..సాటి మనుషుల్ని గౌరవించే సంస్కారం వుంటే కదా వెధవకి..

మా వేణు మోహన్ గాడికి ప్రసంసలె కానీ విమర్శలు పనికిరావంట.. అందుకే నీ వెనక ఒక పది మంది భజన సంఘాన్ని పెట్టుకో అప్పుడు వాళ్ళైతే నువ్వే చెత్త పని చేసినా మెచ్చుకుంటారు

ఒరేయ్ వేణు
మోహన్ వెధవా నువ్వు గీసే పనికి రాని పిచ్చి గీతలు గురించి కామెంట్లు ఇవ్వటానికి నీకోసం రవివర్మలు, పికాసో లు వస్తారనుకున్నావా నిన్ను మెచ్చుకోవటానికి???
ఒక పని చెయ్యి నువ్వేసే పిచ్చి బొమ్మలన్నీ కట్ట కట్టి నువ్వు పైకి వెళ్ళేటప్పుడు తీసుకు పో అప్పుడు వాళ్ళు మెచ్చుకుంటారు నీ ప్రతిభ చూసి సరేనా???


కళాకారుడికైనా విమర్శలే వారు ఇంకా ఎక్కువ నేర్చుకోవటానికి పనికి వస్తాయి..
అంతే కానీ భజన పరుల మెచ్చుకోళ్ళు వింటూ నీ గురించి నువ్వు ఏదో ఊహించుకుంటే చివరికి నువ్వు కూడా మీ నాన్న ఎల్లయ్య లాగా ఇళ్ళకి సున్నాలేసుకోవాల్సిందేనయ్యా .... వేణు మోహనా....
విద్య వల్ల వినయం రావాలి కానీ ఒళ్ళు బలుపు కాదు..

ఇప్పటికిన్తేనయ్యా వేణు మోహన్ కధ అయిపోయిన్దయ్యా... ఏమన్నా సంగతులుంటే మళ్ళీ చెప్పుకున్దాంయ్యా..

ఒరేయ్ భరత్తూ పిచ్చి నా కొడకా ...

6 కామెంట్‌లు

ఏమిటో నాకు తగిలే నా కొడుకులందరూ ఇట్టాంటి లత్కోరు నాయాల్లే తగులుతుంటారు ఏమి చేద్దాం???
మొన్న మురారి గాడి పంచాయితీ అయ్యిందా?? ఇవాళా మళ్ళా ఆ భరత్ గాడు..
వీడేమి చేసాడు అనుకుంటారా??? వెనకటికి ఒకడు ఎర్ర చీర కట్టినోల్లందరూ నా పెల్లాలే అన్నట్టు వీడు ఎవరైనా ఆడోళ్ళు మగాళ్ళు మాట్లాడుకుంటే చాలు సంబంధాలు అంట కట్టేస్తాడు.

వీడి ఫ్రెండ్ ఒకడికి సిటీలో వుద్యోగం వచ్చింది.. వుద్యోగం వచ్చిన కొత్త, రూం అద్దెకి తీసుకోవటానికి డబ్బులు లేవు,తిండి తినటానికి డబ్బుల్లేవు .. ఇలాంటి టైం లో వాళ్ళ బంధువులాయన వీడి ఫ్రెండ్ ని పిలిచి మొదటి నెల జీతం వచ్చేదాకా వాళ్ళింట్లో ఉండమని అన్నాడంట ... పాపం వీడికి దొరికిన ఆధారం చూసి మా ఫ్రెండ్ అదే ఆ భారత్తు గాడికి కుళ్ళు పుట్టింది.వాడికి వొళ్ళంతా కుళ్లే వెధవకి..

ఇంకేముంది ఆ ఆ ఇంటామెకి వాడి ఫ్రెండ్ కి ఏదో అక్రమ సంబంధం వున్నట్టు,అందుకే వాడ్ని ఇంట్లో పెట్టుకున్నట్టు, మంచి మంచి వంటలతో మేపుతున్నట్లు కుక్క వాగుడు వాగాడు కుక్క వెధవ నా దగ్గరకొచ్చి, అంతే వాడిని లాగి పెట్టి ఒక్క తన్ను తన్నాలనిపించింది నాకు...

వీడికేమి తెలుసు అన్నపూర్ణమ్మ లాంటి ఆడవాళ్ళ విలువ,, అమ్మా ఆకలి అంటే అన్నం పెట్టే ఆడవాళ్ళు మన పూర్వీకుల కాలం నుండి వున్నారు..అప్పట్లో ఇలా చదువుకోవటానికి తిండి లేక ఇబ్బంది పడే వాళ్లకి వారాలబ్బాయిలుగా ఇంట్లో పెట్టుకుని,పోషించేవాళ్ళు. అప్పట్లో ఈ భరత్తు గాడి లాంటి చెత్త వెధవలు వుంది వుండరు వాళ్ళని అనుమానించటానికి..

అయినా వాడి తప్పేముంది లెండి వాడి అమ్మ,అక్కలు,భార్య ,పిల్లలు ఇలాంటి పనులే చేస్తారేమో
అందుకే వాడికి ఏ ఆడవాళ్ళని చూసినా అలాగే అనిపిస్తుంది పాపం..

నేను వాడికి ఒక్కటే చెప్పా పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనపడినట్టు నువ్వు ,నీ ఇంట్లో ఆడవాళ్ళు తప్పుడు వెధవలని అందరూ అంతే అనుకోకురా వెధవా అని.. ఇప్పటికైనా వాడు మారితే మంచిది..లేకపోతే బురదలో దొర్లే పందిని తన్నినట్టు
తంతారు వాడిని ఆడోళ్ళు ..

ఇంతకీ వీడికి బయటి వాళ్లలోనే ఇన్ని తప్పులు కనపడుతున్నాయి కదా వీడిలాంటి వెధవతో ఆ పెళ్ళాం ఇంకా కాపురం చేస్తుందంటార??????? లేకపోతే పెళ్ళాం ఏమి చేసినా కుక్కలాగా పడి ఉంటాడేమో వీడే!!!!!!!


గాలి..మురారి గాడు ... ఓ జ్ఞాపకం

7 కామెంట్‌లు

ఈ రోజు మదర్స్ దే అంటే నాకు మా ఫ్రెండ్ గాలి.మురారి గుర్తుకొస్తాదండీ..
ఎందుకంటారా నా స్నేహితుల్లో అందర్లో పరమ గాలి వెధవ ( మంచోడని చెప్తాననుకున్నారా?)..
వాడు చేసే గాలి పనులకి వాళ్ళ అమ్మ చెప్పు దెబ్బలు తినేది వూర్లో జనాలతో ..
మురారి గాడి అమ్మ హై వే రోడ్డు పక్కన ఉదయం ఇడ్లీలు,మధ్యానం బోండాలు అమ్మేది మరి రాత్రులు ఏమి అమ్మేదో కుటుంబ పోషణ కోసం..ఈ విషయం నాకంతగా తెలియదు కానీ మా వూర్లో జనాలు మాత్రం కధలు కధలు చెప్పేవాళ్ళు మురారి గాడి అమ్మ గురించి..

ఇంకా మురారి గాడు కొత్తల్లో సినిమాల్లోకి వచ్చినప్పటి అల్లరి నరేష్ గాదిలాగా చీకేసిన తాటికాయలాగా ఉండేవాడు.మురారి గాడు అమ్మ హోటల్ సంపాదన మీద బతికేవాడు కానీ మా కాలేజ్ లో మాత్రం వాడి ఫోజులు మాత్రం ఆ వూరి మోతుబరి రైతు కొడుకంత లెవెల్లో ఉండేవి.ఇంకా మురారి గాడు వాడి చిల్లర పనుల కోసం వాళ్ళమ్మ గుడిసె హోటల్ లో గల్ల డబ్బాలో డబ్బులు కొట్టేసి మా ముందు ఫోజులు కొట్టేవాడు.మేమంతా వాడి పనులకు వాడి ముందు ఏమనకపోయినా వాడి వెనక తెగ జోకులేసుకుని నవ్వుకునే వాళ్లము వాడి అతి వేషాలకి.

ఒక రోజు వాడి పైత్యం మరే పరాకాష్టకు చేరి మా వూరి కమ్మారి అమ్మాయిని వాణిని ఏదో అన్నాడు అంతే చీమలు పాకే చింత చెట్టుకి వాడ్ని కట్టేసి చింత బరికెలతో బాదారు పాపం...
అంతే వాడి వొళ్ళు అసలే వరద బాదితుదిలాగా ఉంటుందేమో,,, ఆ వాతలు తేలిన ఆ మురారి గాడి ఒళ్ళు చూడలేక భయపడి మా వూర్లో పిల్లలకు దడుపు జొరం వచ్చింది...

ఇంకొక రోజు డబ్బులు అవసరమయ్యి వాళ్ళ అమ్మ పాత గుడ్డలు తీసుకుపోయ్యి బుడబుక్కలాడికి అమ్ముకున్నాడు.అప్పుడు ఊరంతా ఈ మురారి గాడి కంటే ఆ బుడబుక్కలోడే నయంరా కష్టపడి పని చేసుకుని బతుకుతాడు అనుకున్నారు.ఇన్ని చేసినా వాళ్ళమ్మ వాడిని కాపాడుతూనే వుండేది పాపం.

కానీ తిట్టే నోరు,తిరిగే కాలు వూరుకోదన్నట్టు ఈ మురారి గాడు మళ్ళీ అమ్మాయిలని ఏదో గెలుక్కున్నాడు..
అంతే ఈసారి అవేర్నెస్ పెరిగిన అమ్మాయిలు ఈ మురారి గాడ్ని నాలుగు తన్ని,పోలీసులతో మరో నాలుగు తన్నిచ్చి ఖైదీ నెం 420 లా జైలు లో పెట్టించారు..

కానీ మా గాలి.
మురారి గాడేమన్నా తక్కువ తిన్నాడా??
జైలులోనే దూర విద్యలో B.A చదివి,కంప్యూటర్ లో కూడా మిడి మిడి జ్ఞానం నేర్చుకున్నాడని మా ఊరంతా తెగ మెచ్చుకునే లోపే ఈ మధ్యే ఇంకో విషయం తెలిసింది..
ఆ నేర్చుకున్న కంప్యూటర్ మిడి మిడి జ్ఞానం తో ఇంటర్ నెట్ లో బూతు కధలు రాస్తన్నాడంత .

ఇది తెలిసిన నా స్నేహితులు నేను అనుకున్నాము వీడికి మళ్ళీ
మురారి -- ఖైదీ నెం 420 అయ్యే రోజులు వచ్చినట్లున్నాయిరా అని ...

కానీ వాళ్ళ అమ్మ ఏమందో తెలుసా ఐతే ఏందయ్యా ఈ సారి నాకొడుకు జైలు లో దూర విద్యలో M.A కూడా చదివి వస్తాడు బయట వుంటే ఎలాగూ ఆ మురారి గాడు చదవడు కదా అన్నది..

వింటున్న నాకనిపించింది ఆహా ఇదేనా అమ్మ మనసంటే అని..
పాపం గాలి.మురారి గాడి తప్పు మాత్రం ఏముందిలే వాడి బ్రతుకు నెల మీద అయినా కలలన్నీ కలర్ ఫుల్లు పాపం..

అందరికీ Happy MoTher's Day

నేను కవిని కాదన్న వాడిని కలంతో పొడుస్తా :):)

7 కామెంట్‌లు
అందరూ కవితలు రాసేస్తున్నారు మరి నేను కూడా రాయకపోతే మనసులో ఎట్టేసుకుంటారు కదా నా సహచర బ్లాగర్లందరూ.. అందుకే ఈ నా కవిత ...


ఎవరు నువ్వు మిత్రమా!
గిరి గిరి మరి మరి తిరిగినా
నీ సరిలేని సిరి కానరాక
విసిగి విసిగి విధిరాతను ... విధాతను
అడిగి అడిగీ, కన్నీటితో కడిగి కడిగీ
నిరాశతో నేనున్నప్పుడు --
నిశార్ధ భాగపు నింగి నుండి
విశాల ఆర్ధ్రపు ఆత్మీయతతో
రాక రాక నీవు రాగ
అనురాగ రాగం గొంతుదాటి రాక
మత్తు నన్ను చిత్తు చేస్తున్నప్పుడు
గమ్మత్తుగా వచ్చి చిత్రంగా వెళ్లి పోయావేం
ఎవరు నువ్వు మిత్రమా??
వెంటనే వెళ్లావు అంత ఆత్రమా???


ఎలా వుంది నా కవిత! బాగా రాసాను కదా ???