
మా బాబాయ్ కి పెళ్ళయ్యింది లైఫ్ లో కిక్కు దొబ్బింది.. వద్దురా సోదరా పెళ్ళంటే నూరేళ్ళ మంటరా అని నాగార్జున చెప్పిన మాట వినకుండా పెళ్లి చేసుకున్నాడు... పాములాంటోడు వావపాము అయ్యాడు పాపం..
ఎంతైనా వయసు మీద పడ్డాక పడ్డట్టే ఉండాలా??? వెనకటి రోజులు రమ్మంటే ఎలా వస్తాయి.. ఇప్పుడెల్లి యూత్ కి నచ్చే సినిమాలు చూస్తాను అంటాడు చూశాక మళ్ళీ అయ్యి బాగాలేవురా డబ్బులు దండగ అని ఏడుస్తాడు??
నేను చెప్పా బాబాయ్ నీకు వయసు మీద పడ్డ హీరోలు చేసే సినిమాలే కరెక్ట్ ఆ సినిమాలే చూడు.. ఇప్పుడు యూత్ లాంగ్వేజ్ నీకు అర్ధం కాదు,వాళ్ళ చేష్టలు నీకు వింతగా అనిపిస్తాయి అని ..అయినా నీకు ""తొడ రుద్దుకునే"" హీరోలు నచ్చుతారు కానీ ""మెడ రుద్దుకునే"" హీరోలు నచ్చరులే అని కూడా చెప్పా వింటావా?? వినవు ...
అయినా బాబాయ్ వయసు మీద పడ్డ నీలాంటోళ్ళ కోసమే కదా వయసు మీద పడ్డ బాబాయ్లు ,నాన్నలు హీరోలు ఎంతమంది లేరు?? అయినా ఊరందరిదీ ఒక దారైతే ఉలిపిరి కట్టేది ఇంకో దారి అన్నట్టు అందరూ గబ్బర్ సింగ్ సినిమా బాగుంది అంటుంటే నీకెందుకు బాబాయ్ అంత కుళ్ళు??? ఎంత కులాభిమానమైనా ఇంత పనికిరాదు బాబాయ్ నీకు.
అందుకే శుభ్రంగా రేపెప్పుడో జీ టీవీలో రామరాజ్యం సినిమా వస్తది అది చూడు, నీకు అదే కరెక్టు.. అయినా గబ్బర్సింగ్ తో నీకెందుకు చెప్పు సగం ముసలోడివి .. ఆ తుపాకీ తూటాల సౌండ్ కి నీ ముసలి చెవులు పొతే మా పిన్నికి సావు వస్తది నిన్ను పిలవలేక జాగ్రత్త.
అప్పుడెప్పుడో పవన కళ్యాన్ ఖుషి నచ్చింది కానీ ఇప్పుడు నచ్చటం లేదు అంటే బాబాయ్ ఒక్కసారి నీది అప్పటి ఫోటో,ఇప్పటి నీ ఫోటో పక్క పక్కన పెట్టి సూసుకో నీకు నువ్వే చీదర పుట్టేటట్టు ఉండకపోతే చూడు..
అప్పట్లో బెల్బాటం ఫ్యాంట్ వేసుకుని ఉంటావు .. ఇప్పుడు కూడా అదే వేసుకుంటే నీ వెంట కుక్కలు పడవూ ఎవడో కేతి గాడు వచ్చాడని??
ఎప్పటి ట్రెండు అప్పటిదే బాబాయ్ నీకు ఫాలో అవటం వస్తే ఫాలో అవ్వు లేకపోతె నీలాగా కళ్ళ కింద కారీ బాగ్ లు పెట్టుకునే హీరోల సినిమాలు వచ్చినప్పుడే సినిమా చూడు,ఆ ముసలి హీరోల భజనే చెయ్యి సరేనా ...బాబాయ్ ఇంక ఉంటా..


1 కామెంట్‌లు:
baaga chepparu.
కామెంట్‌ను పోస్ట్ చేయండి