బ్లాగర్లకు ఫ్రీ ప్రచారం - ఎందుకు విచారం???


ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటారు
కానీ మీరు వెళ్ళరు ...




ఏమిటో ఈ జనాలు తిట్టినా బాధే ,పొగిడినా బాధే..
నన్నెవరు పొగడరు,గుర్తించరు కనీసం కామెంట్లు కూడా ఇవ్వరు అని నేను బాధ పడుతుంటే
మా గొప్పల గురించి ప్రచారం చేసార్రా నాయనా అని గోల గోల చేస్తారెందబ్బా??

ఇంతకీ నేను మాట్లాడేది ఎ విషయం గురించంటే ఈ మధ్య మన బ్లాగుల్లో జరుగుతున్నా హాట్ టాపిక్ గురించే..

మొన్నన్యూ ఇయర్ సందర్భంగా మన తెలుగు బ్లాగుల్లో"గొప్ప" బ్లాగులు అనిపించిన వాటిని ఆంధ్రజ్యోతి పత్రికలో
ప్రచురించారట ఎవరో పాపం.కొత్త ఏడాదిలో సదరు బ్లాగర్ల "కళ్ళల్లో ఆనందం" చూడాలని..
కానీ మన బ్లాగర్ల వారు ఆంధ్రజ్యోతి వారి కళ్ళల్లో ఆనందం చూసే కాన్సెప్ట్ కి ఏ మాత్రం విలువ ఇవ్వకుండా..
వాళ్ళ మంచి మనస్సును అర్ధం చేసుకోకుండా మాకు చెప్పకుండా పేపర్ లో వేసేస్తారా అని గొడవ మొదలు పెట్టారు..

అయినా బ్లాగర్ పేరు పెట్టకుండా ఇది నేనే రాశానోచ్ అని వేసుకుంటే తప్పు కానీ
బ్లాగర్ల పేర్లు,వివరాలు, బ్లాగ్ URL తో సహా ప్రచురిస్తే తప్పేంటి అని??

అదే నేనైతేనా నాకు తెలిసిన పత్రికల్లో వాళ్ళు ఎవరైనా వుంటే ఏమి చేసైనా నా బ్లాగ్ గురించి రాయించి
పబ్లిసిటీ కొట్టేయ్యాలని చూస్తుంటే వీల్లెన్టండీ బాబూ ఫ్రీ గా వచ్చిన పబ్లిసిటీ గురించి ఇంత బాధపడిపోతున్నారు.

"అయినా మనలో మన మాట నాకు వాళ్ళని చూస్తుంటే పైకి బాధపడినట్లు కనిపించినా లోపల్లోపల
తెగ సంతోషపడిపోతున్నరేమో ప్రచారానికి అని ఒక చిన్న డౌట్ ఏమంటారు??"

వుంటాను మరి నా బ్లాగ్ ఎప్పుడు పడుతుందో పేపర్లో..???
నాకెప్పుడు 100 లు 100 ల మంది ఫాలోయర్స్ ఉంటారో???

12 కామెంట్‌లు:

రసజ్ఞ చెప్పారు...

హహహ! అవునా?ముందు అది చదవాలి! మీరు బాధపడకండి సందీప్ గారూ! మీరొక్కరూ(నిండు చంద్రుడు) ఒక వైపు అందరూ(చుక్కలు) బ్లాగర్లు ఒకవైపు. అల్ ది బెస్ట్!

sandeep చెప్పారు...

oh oh my friend...

nijamgaa meerandi nijamaina snehituraalu.

naa baadhanu ardham chesukunnanduku Many Thanks...

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

సందీప్ గారూ, ఈ సారి పొరపాటున మిమ్మల్నడిగితే నాబ్లాగుపేరు కూడా కాస్త రెకమండ్ చేయడం మరిచిపోకండే :-). అసలే హిట్లులేక సచ్చి పోతుండా :))

sandeep చెప్పారు...

amma baboy idi kala nijama??
meeru naa blog lo comment ivvtame

ide naaku goppa pracharamandi.
thankyou verymuch.

tappakunda mee mata kuda gurtnchukuntanu lendi
:):):)

Disp Name చెప్పారు...

'సాందీపు' గారు,

ఈ మూడు టపా శీర్షికలు మీకు ఇస్తున్నాను. టపా పూరించండి. మీరు ఆపై కామెంట్లు వద్దే వద్దండి అన్నంత దాక వస్తుంది.

౧. వేదం లో విమానాల మోత
౨. సభ్య వస్త్రధారణ అనగా ఏమి ?
౩. సమాజం లో బ్లాగ్ వల్ల ఉపయోగం ఉందా ?

చీర్స్
జిలేబి.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

సంతోషమే మాష్టారు. ఆమదానంద కందళిత హృదయార విందుడనైతిని(అర్ధం అడగకండి. ఎక్కడినుంచో కాపీ కొట్టాను. హహహ) అని కూడా చెప్పుకున్నాను. నీ కధ పత్రిక లో పడింది. పోయి చూసుకోరా పుల్లయ్యా అని ఎవరో చెప్పడమే కొంచెం అదోలా అనిపించింది అన్నమాట.

ఎందుకు వేశారు అని అడగలేదు. కనీసం ఒక మాట చెప్పలేదనే.

sandeep చెప్పారు...

జిలేబి గారు మీ రాకతో ,మరియు మీ కామెంట్ తో
"నా గుండె గూటికి పండగొచ్చింది"
(మనలో మన మాట ఇది ఒక పాట లెండి నా కవిత్వం కాదు)

ఇంక మీరు ఇచ్చిన శీర్షికలతో టపాలు శంఖం పూరించినట్లు పూరించి
మీ సవాలుకు సమాధానం చెప్తానని ఈ సందర్భంగా
నొక్కి వక్కాణిస్తున్నాను..

sandeep చెప్పారు...

బులుసు సుబ్రహ్మణ్యం గారూ.. "ఆమదానంద" కాదేమో

అమందానంద కందళిత హృదయారవిందుడు అనాలేమొ??

ఎంత నన్ను తిట్టాలనిపిస్తే మాత్రం మీలాంటి పెద్దవారి నోట
మదం మాత్సర్యం అన్న మాటలు రావచ్చునే
అకట ఎంత కఠినాత్ములు ఈ బులుసుసుబ్రహ్మణ్యం వారు :( :(

ఆత్రేయ చెప్పారు...

సందీప్
స్కూల్ రోజులు గుర్తులేవా
క్లాస్ లో మొదటి లైనులు క్లెవర్లు,
తర్వాత రెండు మజ్జి రకాలు (మధ్య, మజ్జి అంటే మూలగ కాదు)
ఎనక రెండు మాస్ బాచ్
మనం ఎక్కడున్నామో ..
నా సంగతి చిన్నప్పటి నుంచీ ఎప్పుడూ సందేహమే !!

sandeep చెప్పారు...

బ్రదర్ ఆత్రేయ! స్కూల్ రోజులు నేను చిన్నప్పటి నుండి ఫస్ట్ బెంచీనే .
ఏమిటో ఈ బ్లాగ్ లోకంలో చదువు తెలివిని మించిన తెలివితేటలు వుండాలనుకుంటా మొదటి వరసలో వుండాలంటే..

ఎందుకో ? ఏమో ! చెప్పారు...

:)

?!

sandeep చెప్పారు...

@ ఎందుకో ? ఏమో !

Thankyou Friend

కామెంట్‌ను పోస్ట్ చేయండి