ఏంటో ఈ ఎండాకాలం ఏవేవో తినాలనిపిస్తుంది...ఏవేవో తాగాలనిపిస్తుంది.
బత్తాయిలు,ద్రాక్షాలు,పుచ్చకాయలు,పిచ్చికాయలు ... ఇంకా మార్కెట్లో దొరికే పేరు లేని కాయలు
ఇలా ఏవేవో తింటూనే ఉన్నా ... ఇంకా ఏవేవో తినాలన్నా నా కోరిక తీరటం లేదు ఏమిటో !
నేను ఇలా పేరు లేని కాయలు,వాటి లోపలి గింజలు,పప్పులు కూడా తినటం చూసి
నా శిష్యుడు ఒకడు వీటితో పాటూ "ఆ" పప్పులు కూడా తినేయ్యండి గొడవ వదిలి పోతుంది అన్నాడు..
బ్రహ్మానందాన్ని గుండు అన్నట్లుగా ..నా చీదర తిండి చూసి వాడికెంత చీదర పుట్టిందో పాపం..
ఏదోలెండి వాడి అభిమానం వాడిది. ఎంతైనా కాయ పళంగా తిన్నా కానీ,కొన్ని గింజలోపలి
పప్పులు పగలకోట్టుకుని తింటే ఆ మజాయే వేరు..
ఈ సారి ఏ కాయలు తెచ్చుకున్నా ఆ కాయ లోపలి గింజ ,గింజ లోపలి పప్పు కూడా తీరికగా
ఏ గుండ్రాయో తీసుకుని పగలగొట్టుకుని తినేయ్యండి రుచికి రుచి. పొదుపుకి పొదుపు..


0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి