
తెరకి అడ్డంగా సరిపోయే ఈరోలు(హీరోలు) ఉన్న ఈ రోజుల్లో బుల్లిపిట్ట లాంటి పర్సనాలిటీ ఉన్న రామ చరణ్ జనానికి ఏమి నచ్చుతాడయ్యా??
పెద్ద పెద్ద కత్తులెయ్యి??
ఒంటి కంటి సైగ తో చంపేసే ఫైటింగు లేయ్యి??
తొడ గోడితే ఆ సౌండ్ కే చచ్చే తొడ చరుపులేయ్యి??
ఎగిరెగిరి పడే సుమోలెయ్యి??
తాత కాడినుంచి బాబాయి ల దాకా వంశ చరితర్ను పొగిడే సీన్లు ఉండాయా??
వాన పాటంటే ఎట్టా ఉండాలా?? ఆకు చాటు పిందే తడిసే అని తాత,మనవడు కలిసి ఆడినట్టు ఉండాలా!!!!
అత్త వరసయ్యే ఆంటీతో డబల్ మీనింగ్ డైలాగులెయ్యి??
ఏందో తీసామంటే తీసామన్నట్టు సినిమా తీస్తే ఎట్టాగయ్యా కొంతమందిని సూసైనా నేర్చుకోండి..కంటి చూపుతో,తొడ చరుపుల్తో ప్రేక్షకుల్ని భయపడ్డ బల్లుల్లాగా కుర్చీలకు అంటుకు పోయేలాచేయటం ఎలాగో??
మీకు తెలియక పొతే వాళ్ళ అరివీర భయంకర ఆడ,మగ ఫ్యాన్స్ నైనా అడిగి చూడండి.వాళ్ళు చెప్తారు సినిమా ఎట్టా తీయాల్నో..
ఏంటో గుండె దడ దడ గా ఉంటుంది ఈ మధ్య ఇది ఏ రానున్న దడకి సంకేతమో మరి???


8 కామెంట్లు:
ఇంతకి సినిమా బాగునట్టా లేనట్టా?
గుండె దడ మీకు సినిమా చూసినందుకా..లేక చూసిన సినిమా మీరు ఊహించినట్టు/వివరించినట్టు (అదే సుమోలు వగైరా , వగైరా..) దడ దడ లాడలేదనా? అసలు విషయమేమిటంటారు?
జలతారు వెన్నెల గారూ
ఇంత చెప్పినా మీకు అర్ధం కాకా
లెక అర్ధం చేసుకోలేకా
లేక అర్ధమయ్యీ కాకా
ఏమిటొనండీ అసలే రాబొయే దడ సినిమా గురించి ఆలోచిస్తూ
నాకు దడ దడగా ఉంటే మీ ప్రశ్నలతో నన్నింకా ఉక్కిరిబిక్కిరి చేసెస్తున్నారు..
ఇంతకీ ఇప్పటికైనా అర్ధమయ్యిందా నాకు దడ ఎందుకో..
ఒహ్..రచ్చ రచ్చ రచ్చగా ఉంది.
దడ యెలా ఉంటుందో అన్న దడ అన్నమాట . ఇలాగున అర్ధం కాకుండా చెబితే యెట్టాగు సందీపూ...
యెవిటో మా ఆడాళ్ళ బుర్రలు ఒట్టి మట్టి ముద్దలాయే. వివరంగా చెపితె కామెంట్ పెట్టె బాధ తగ్గును కదా!
నా అజ్ఞానానికి క్షమించండి! నాకు "దడ" సినిమా ఒకటి రాబోతుందని మీరు చెప్పేవరకు తెలీదు!
వనజవనమాలి గారూ మట్టి ముద్ద అంటనే మొత్తం అర్ధం చెసేసుకున్నారు.
మీరండీ నా నిజమైన శ్రేయోభిలాషి!!!!!
రచ్చ రచ్చ చెసేశాము గందా ఇంక """దుమ్ము దుమ్ము""" లేపి సూసే వాళ్ళ కళ్ళల్లో ""దుమ్ము"" కొట్టడానికి రెడీగా ఉందాము!!! ఏమంటారు???
జలతారు వెన్నెల గారూ మనలో మనకి క్షమాపణలు ఎందుకండీ???
దడ సినిమా ఇంతకు ముందే వచ్చిందండీ!
ఇప్పుడు రాబొయేది దడ పుట్టించి,దుమ్ము లేపే ""దమ్ము""న్న
సినిమా అన్నమాట.
మీరు అజ్ఞాని అని నేను అనలేదండీ మీరు పొరబాటున అలా అర్ధం చేసుకుని నా బ్లాగ్ కి రావటం మానెయ్యకండి ప్లీజ్..
అసలే మీరు,వనజవనమాలి గారే నాకు రెగ్యులర్ గా కామెంట్ ఇచ్చే నా శ్రేయోభిలాషులని ఇప్పుడిప్పుడే డిసైడ్ అవుతున్నాను.
అసలు రచ్చ ఎమిటో, దడ ఎమిటో,దమ్ము ఎమిటో, దూకుడు ఎమిటో..అంతా అయోమయమే!
జలతారువెన్నెల గారూ బాగా చెప్పారు..
""అయోమయం"" అన్నట్లు ఈ టైటిల్ తో సినిమా రానట్లుంది కదండీ ఇంత వరకూ..
కామెంట్‌ను పోస్ట్ చేయండి