సమ్మర్ స్పెషల్ పిచ్చి బంతి ఆట --- బ్లాగర్లకు ఆహ్వానము.


చిన్నప్పుడు ఎండాకాలం వస్తే సరి మా పిల్ల గుంపు అంతా ఒక చోట చేరి ఆటలు ఆడుకునే వాళ్ళం.ఈ ఎండలకి బడి సెలవలు ఇవ్వంగానే మనమే కింగులము వీధులకి. వీధి వీధంతా నాదే అన్నట్లు గాలి తిరుగుళ్ళు తిరగటమే పనిగా ఉండేది మాకు.దారెంట పోయే పుల్ల ఐసోడ్ని వదలకుండా కొనుక్కొని ఆ రంగు నీళ్లన్నీ చొక్కాల నిండా పూసుకుంటూ తింటూ వుంటే ... ఆహా నా రాజా ఆ సంతోషమే వేరు..

ఒంటి నిండా చెమట కాయలు వచ్చినా,సెగగడ్డలు వచ్చినా ( ఇవి ఎండాకాలం ప్రత్యేక బహుమతులు ఒంటికి ) మా ఆట ఆగేది కాదు. ఉడుం,ఉడతా ఉడతా ఊచ్,కర్రా బిళ్ళా,గోలీలు, గద్దోచ్చే కోడి పిల్లా ఇలా రక రకాల ఆటలు ఉండేవి అప్పట్లో.
ఇంక నాకు ఆటలన్నిట్లో ఇష్టమైన ఆట పిచ్చి బంతి ఆట, గద్దోచ్చే కోడి పిల్ల ఆట అన్నమాట..

పిచ్చి బంతి ఆట కాగితాలతో,గుడ్డ ముక్కలతో పేరుకు తగినట్లు ఒక పిచ్చి బంతిని తయారుచేసుకుని దాంతో మన గుంపులో వున్నోల్లనరినీ చితకకోట్టటమే ఈ ఆట.. నాతో పలకనోల్లని కూడా ఈ ఆటకి మాత్రం ప్రత్యేకమైన ఆహ్వానం ఇచ్చి మరీ పిలిచుకోచ్చేవాడిని ఎందుకంటే ఆటలో అరటిపండులాగా నాకు కచ్చ ఉన్నోల్లందరినీ చావ గొట్టొచ్చు కదా అందుకని ;)
ముందు ఒకడి చేతిలో పిచ్చి బంతి పెట్టి మిగతా వాళ్ళందరూ పిచ్చోళ్ళ లాగా రోడ్లమ్మట వురకాలన్న మాట.
ఆ పరిగెత్తే పిచ్చోల్లని ఈ బంతి పట్టుకున్న పిచ్చోడు ఇష్టమొచ్చినట్టు కొట్టి చంపాలన్న మాట.
( నిజంగా చంపటం కాదులే ) ఇదీ ఆట. ఇంక ఆట ముగిసే సమయానికి ఒక్కొక్కడి వీపు మీద వాతలు తేలేయి..
వాతలు చూసి మా యమ్మోల్లు అదే ( అమ్మలు) పంపుల దగ్గర కొట్టుకునే ఆడంగుల్లాగా కొట్టుకోవటానికి రెడీ అయ్యేవాళ్ళు ( ఎంతైనా కడుపు తీపి కదా )...

ఇదండీ
నా పిచ్చి బంతి ఆటల ముచ్చట్లు .. ఇందుమూలంగా నాకొక ఆలోచన వచ్చింది మన పాత,కొత్త బ్లాగార్లందరమూ కలిసి, ఈ సమ్మర్ లో సమ్మర్ కాంప్ వేసుకుని పిచ్చి బంతి ఆట ఆడితే బాగుంటుందని
ఒక
చిన్ని ఆశ కలిగింది.. ఏమంటారు???
బ్లాగర్లందరూ సహృదయంతో,క్రీడా స్ఫూర్తి తో నా కోరిక మన్నిస్తారని ఆశిస్తున్నాను.

4 కామెంట్‌లు:

జలతారు వెన్నెల చెప్పారు...

Sandeepu.........!!!shhh! gupchup!
asalu comedy mari ekkuvayindi abbaayi neeku...
navvi navvi kallalOki neellochaayi ante nammu. anyways.... LOL....

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

:)) Picchi banti aata .. bhale unde!?

now..starting ..
Comment debbathO.. aata. With pleasure!!!

sandeep చెప్పారు...

జలతారువెన్నెల గారూ! ఎప్పుడూ సీరియస్సేనా కాస్త కామెడీ కూడా ఉండాలండీ లైఫ్ లో మన బ్లాగర్లందరూ సమ్మర్ స్పెషల్ ఆటలు గుర్తు చేసుకుంటుంటే నాకూ నా ఫేవరెట్ "పిచ్చిబంతి" ఆట గుర్తొచ్చింది అంతే!! మిమ్మల్ని నవ్వించినందుకు చాలా సంతోషం,, thankyou!!

sandeep చెప్పారు...

వనజవనమాలి గారు,మా ఆహ్వానాన్ని మన్నించి మీ కామెంట్ బంతితో ఆట ప్రారంభించినందుకు ధన్యవాదాలండీ :):):)

కామెంట్‌ను పోస్ట్ చేయండి