
ఈ మధ్య బ్లాగుల్లో ఏమి రాసినా ఎవరికీ నచ్చటం లేదు
బ్లాగుల్లో వార్తల్లో విషయాల గురించి రాయ కూడదుట ..
టీవీలో వచ్చే విషయాల గురించి చర్చించకూడదుట.
పాటలు పెడితే కాపీ ... పేస్ట్ అంటారుట..
పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తే సొంత విషయాలు అంటారుట...
కవితలు రాస్తే సొంతమా కాదా అంటారుట..
ఇంక బ్లాగుల్లో ఏమి రాయాలి??? ఎలా రాయాలి అని ఒకటే టెన్షన్‌గా ఉందా???
చాక్లెట్ ఖానే మే టెన్షన్ హై // దూద్ పీనే మే టెన్షన్ హై // ఆఖిర్ బ్లాగ్ పోస్ట్ రఖనే మే భీ టెన్షన్ హై //
అని టెన్షన్ పడే అందరికోసమే ఈ ట్యూషన్..
1. మీ బ్లాగ్ పేరు ఎంత వెటకారంగా ఉంటె అంత మంచిది ఉదాహరణకి పిచ్చిలేక, పొలికేక , కందిపప్పు,
వడపప్పు,పానకం, దవనం ఇలాగన్నమాట.
2. బ్లాగుల్లో ఎప్పుడూ ఎవరినో ఒకరిని విమర్శిస్తూ లేని పాత్రలను స్నేహితులుగా,మన కొలీగ్స్ గా
పరిచయం చేస్తూ ... పాత్రలను సృష్టించి వాళ్ళతో వింత వింత పనులు చేయించి,చెత్త మాటలు మాట్లాడించి
(ఇంతకీ అవన్నీ మన మనసులో పైత్యమే ) వాటిని బ్లాగర్లందరికీ చెప్పాలి.
3.ఎప్పుడూ మనం చెప్పాలనుకున్నది స్ట్రైట్ గా చెప్పకూడదు ఎంత వ్యంగ్యంగా మాట్లాడితే అంత ఫాలోయింగు మరి.
4. నారాయణా అన్నా బూతులాగా వినిపించాలి..అప్పుడే అందరికీ నచ్చిన పాత సినిమాల్లో కూడా
తప్పులు,లోపాలు వెతికేసి వాటి గురించి వ్యంగ్య విశ్లేషనలను చేయగలము.
రేపు లో కూడా రేప్ ని చూడగలగాలి.
5. వీలైనంత ఎక్కువగా మన గొప్పలు తరచుగా చెప్పుకుంటూ వుండాలి. ఉదాహరణకి నేను ఆఫీసుకి
కారులోనే వెళ్తాను అని చెప్పాలి నిజానికి బస్సులో వెళ్ళినా... ఎప్పుడైనా నోరు జారి ఈ రోజు బస్సులో అని
చెప్పినా సరదాగా అలా బస్సు లో వెళ్ళాలనిపించింది ఇవాళ అని కవర్ చేయాలి.
6. బ్లాగుల్లో రోజూ తిరుగుతూనే ఉండి కూడా చాలా బిజీగా ఉన్నట్లు,అందుకే వారానికి ఒక
పోస్ట్ పెడుతున్నట్లు,ఆ పోస్ట్ కోసం బ్లాగు జానాభా మొత్తం వెయిట్ చేస్తున్నట్లు మనకు మనం
ఊహించుకోవాలి.
ఇవీ ప్రస్తుతం ట్యూషన్ లో సంగతులు మిగతావి తర్వాత నేర్చుకుందాము..
ముక్తాయింపు:
అందరూ పల్లకీ ఎక్కేవాల్లె ఐతే మోసేవాడేవాడు అన్నాడంట వెనకటికి ఒకడు..
అలాగే అందరూ కవులు కవయిత్రులే ఐతే ఇంక బ్లాగుల్లో వేరే విషయాలు ఏముంటాయి??
మనమేనన్నా నన్నయ,పోతన,తిక్కన్నలము,కవయిత్రి మొల్లలము కాము కదా బ్లాగుల్లో కవిత్వాలు,
మాహాభారతాలు మాత్రమే రాసుకుంటూ కూర్చోవటానికి.....
అందరికీ జర్నలిస్ట్ ఫ్రెండ్ లు ఉండరు కదా వాళ్ళ గురించి గొప్పగా పేపర్లో వేయిన్చుకోవటానికి..
ఒకామె బాగా రాస్తుందని పదిమంది మెచ్చుకోగానే ఇంకొకళ్ళు కూడా అలాగే రాయటం మొదలు పెడితే
చివరికి అన్ని బ్లాగులూ ఒకేలా తయారయ్యి చూడలేక చచ్చే చావొస్తుంది జాగ్రత్త.
ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడిని రాయనివ్వండి ... ఎవడి పని వాడు చూసుకోండి ...


39 కామెంట్లు:
lol...good one!
lol...good one!
జలతారువెన్నెల Garu ... ThankYou!
కరెక్ట్‌గా చెప్పావ్ మిత్రమా... బ్లాగంటే తమ మనసులో ఉన్నది చెప్పుకోడానికి .. ఎవడెలా రాసుకుంటే వీళ్ళకెందుకట..
@ Dare2Write
Thankyou మిత్రమా
మీ మనసులోని మాట చెప్పినందుకు..
mee maate..naa maata koodaanu.
ఈ రోజు బ్లాగులో కొందరు సీనియర్ బ్లాగర్ల పేర్లు రాస్తూ వాళ్ళు రాసినవే మళ్ళీ మళ్ళీ చదువుతున్నాము తప్ప ఇప్పటి కొత్త వాళ్ళ బ్లాగులు చూడాలంటేనే విసుగ్గ వుంటుంది..
ఇప్పటి బ్లాగులు తళుకుబెళుకు రాళ్ళు అని రాశారు అది చదివిన తర్వాత నాకు ఇలా పోస్ట్ పెట్టాలనిపించింది.
నాతో ఏకీభవించినందుకు థాంక్యూ వనజవనమాలి గారూ..
వామ్మో, వామ్మో,
ఫుల్ ఫైరింగ్ షాట్!
గన్స్ ఆఫ్ బ్లాగ్స్పాట్ !
చీర్స్
జిలేబి.
బాగుందండి . మీరు రాసింది నిజమే .మన భావాలూ అందరికీ నచ్చాలని లేదు . ఎవరికి నచ్చింది వారు రాసుకోవచ్చు .అందరివీ ఒకే బావలు అయితే అదిభజన సంఘం అవుతుంది కానీ అభిప్రాయాలను పంచుకోవడం కాదు . కానీ కొంత మంది వ్యక్తం చేసిన వాటిలో .... నేను కూడా అలానే anukunna విషయాలు ఉన్నాయి. ఉదాహరణకు పత్రికల్లో వచ్చిన వార్తను అలానే పోస్ట్ చేయడం పై కొందరు అభ్యంతరాలు చెప్పారు. ఆ వార్త మీద బ్లాగర్ తన అభిప్రాయం కూడా కలిపి చెబితే బ్లాగ్ కు సార్ధకత ఉంటుంది కదా ఆలోచించండి ...
మీ మాటను బలపరుస్తున్నా.
అమ్మో, అమ్మో, జిలేబీ గారూ...
మళ్ళీ మీ రాకతో నా బ్లాగ్ పావనమయ్యింది.
మీ అభిమానానికి ధన్యవాదములు!
buddha murali గారూ సీనియర్ బ్లాగర్స్ గా మీరందరూ చెప్పే సలహాలు సూచనలు కొత్త వాళ్ళందరికీ ఆమోదయోగ్యమే
కానీ కొందరి పేర్లు ప్రస్తావించి వాళ్ళు బ్లాగులు రాయకపోతే బ్లాగు లోకమే పాడుబడిపోయిన కోట ... తోట అంటూ ఇప్పుడు బ్లాగు రాస్తున్న వాళ్ళందరినీ ఒక పనికి మాలిన వాళ్ళలాగా,తళుకు బెళుకు రాళ్ళు తట్టెడు అంటూ మాట్లాడటం ఏమి సబబు చెప్పండి..
కొందరు బ్లాగర్లు గొప్పగా రాశారని కొంతమందికి అనిపించొచ్చు మరికొంతమందికి అవే రాతలు చెత్తగా సోదిగా అనిపించవచ్చు.
ఎవరి భావాలను ఎవరు నిర్దేశించలేరు కదా..
మీ అభిప్రాయం తెలియచేసినందుకు ధన్యవాదములు..
చిలమకూరు విజయమోహన్ గారూ..
నాతో ఏకీభవించినందుకు ధన్యవాదములు.
పలానా వారివే గొప్ప రాతలు మిగిలిన వారివి పనికి రావు అనే మాటలను నేను సమర్ధించను. తెలుగు నవలా రంగం లో సంచలం సృష్టించిన ఖాకి వనం నవలను తొలుత ఆంధ్రప్రభ వాళ్ళు పనికిరాదని తిరస్కరించారు . తరువాత ఏమయిందో తెలిసిందే కదా అమితాబ్ ను నటనకు పనికి రావన్నారు . ఎవరిని ఎవరు జడ్జ్ చేయగలరు . పత్రికలో వచ్చిన న్యూస్ ను యదతదంగా పోస్ట్ చేసే ఒకటి రెండు బ్లాగ్స్ పైనే నేను కొంత.... ఆ న్యూస్ రాసింది ఆ బ్లాగర్ కాదు ... న్యూస్ పై పోనీ అతని అభిప్రాయం చెప్పినా బాగుంటుందని అంతే
నేను ఒక చూసిన కామెంట్ సుమారుగా ఇలా ఉంది..
టీ కొట్టు వాడు,బడ్డీ కొట్టు వాడు కూడా బ్లాగ్ ల్లోకి వచ్చేస్తున్నారు..బాబోయి" అని అంటే..vaariki బ్లాగ్స్ వ్రాసుకునే స్వేచ్చ లేదా!? అర్హత లేదా?
బాగా చదువుకున్న వాళ్ళు..ఉద్యోగాలు చేసేవాళ్ళు మాత్రమే బ్లాగ్స్ వ్రాయాలా? తతిమా వాళ్ళు వ్రాసుకుంటే తప్పా? వ్రాసే విషయంలో విషయం ఉండాలే కానీ ఆ పోస్ట్ ఎవరికైనా నచ్చ వచ్చు. లేదా నచ్చక పొతే.. ఒక్క క్లిక్ చాలు.అంతే కదా!
buddha murali గారూ మంచి మాట చెప్పారండీ..
ఎవరిని ఎవరు జడ్జ్ చేయగలరు .
కొందరు సీనియర్ బ్లాగర్స్ ఒక చోట కామెంట్ ఇచ్చారు అసలు ఇప్పుడు కొత్తగా వచ్చిన కొన్ని చెత్త బ్లాగుల వల్లే మేము సరిగా పోస్టులు పెట్టలేకపోతున్నాము అని... వాళ్ళూ రాయొచ్చు కదా అప్పుడు అందరూ వాళ్ళవే చదివి మెచ్చుకుంటారు..
ఆడలేక మద్దెల ఓడు అన్నాడట వెనకటికి ఒకడు..
"టీ కొట్టు వాడు,బడ్డీ కొట్టు వాడు కూడా బ్లాగ్ ల్లోకి వచ్చేస్తున్నారు..బాబోయి" అని అంటే..వారికి బ్లాగ్స్ వ్రాసుకునే స్వేచ్చ లేదా!? అర్హత లేదా?"
వనజవనమాలి గారూ ఇలాంటివే అక్కడ చాలా చాలా కామెంట్లు ఉన్నాయండీ..
సీనియర్ బ్లాగర్ల వ్యవహార ధోరణి ఎలాగుందంటే వాళ్ళే రాయాలి అందరూ వాటినే అహా ఒహో అని మెచ్చుకోవాలి..
వీళ్ళకి భజన చేసే భజనబృందం సరే సరి..
ఈ బ్లాగుల్లో ఎవడికి ఇష్టం వచ్చినట్లు రాసుకునే హక్కు వాడికుంది..
ఆడవాళ్ళు చదువుతారన్న స్పృహ కూడా లేకుండా బూతు పోస్టులు పెట్టి,ఏకంగా ఒక డాక్టరు రేపుల గురించి రాసి మన ఆడ బ్లాగర్లందరూ ఏమీ అనుకోరు అనుకుంటాను అంటాడు..
ఇలాంటి రాతల కంటే కొంతమంది ఎవరి జోలికీ పోకుండా రాసుకునే వంటలు,వార్తలు,బొమ్మలు ఎవరికీ ఏమీ నష్టం కలిగించవనుకుంటాను..
ఒక వేళ నిజంగానే టి కొట్టు వాడు , బడ్డి కొట్టు వాడు బ్లాగ్ లోకి వచ్చి ఉంటే నేను చాలా సంతోష పడతాను . నిజంగా అది జరిగి ఉంటే తెలుగు భాషకు అది గొప్ప గౌరవం. ఈ మధ్య మా ఫ్రెండ్ ఒకరు చెప్పిన విషయం ఈ కామెంట్ చదివాక గుర్తుకొచ్చింది. ఆమె న్యాయవాది, ఇంగ్లిష్, తెలుగు , హిందీ , సంస్కృతం లో మంచి ప్రావిణ్యం ఉంది . ఏది కాలం నుంచి వాళ్ల మితురులు కొంత మంది కలిసి సాహిత్య పత్రిక నడుపుతున్నారు ( కేవలం సాహిత్యం పై అభిమానం తోనే ) ఆ మధ్య ఆమె ఆంధ్ర జ్యోతి లో ఓ కథ చదివి , చాలా బాగుందనిపించి రచయిత ఫోన్ నెంబర్ సంపాదించి మాట్లాడారు. ఇందులో విశేషం లేక పోవచ్చు కానీ ఆ కథ రాసిన అతను fci లో హమాలి . ఆమె ఫోన్ చేసినప్పుడు బియ్యం బస్తా దించి మాట్లాడట , చెప్పమ్మా ఏమిటి అని ? అతను రాసిన కథ చూడాలి కానీ అతని హోదా ఏదయితే మనకేమిటి ? ఎప్పుడయినా అతన్ని కలవాలనుకుంటున్నాను. నేను గమనించినంత వరకు ఇప్పుడు సామాన్యులే మంచి కవిత్వం రాస్తున్నారు . కనులు తెరిస్తే జననం, కనులు ముస్తే మరణం రెప్ప పతే కదా జీవితం అని రాసిన కవి నిరు పేడ తనం తోనే మరణించారు. రెండు వాఖ్యల్లో అంతా గొప్పగా రాసిన సంపన్న కవులు ఎవరయినా ఉన్నారా?
మురళీ గారు.. మీరు చెప్పినట్లుగానే ఒక విషయం అండీ! ఇక కవి తొమ్మిదో తరగతి వరకే చదివారు. అతను చేసేది టైలరింగ్ వృత్తి మంచి కమిట్మెంట్ తో కవిత్వం వ్రాస్తారు. అతని కవితలలో "ఐరనీ " యెంత ఉంటుందో! మన బ్లాగ్ లలో ఎవరిదైనా కవిత్వం చూసి..అక్కడ బోలెడంత భజన చూస్తే నేను తెగ నవ్వుకుంటాను. ఆ కవి బ్లాగ్ రాస్తే బాగుండును కదా అని.
ప్రపంచం లో ఉన్న వికృతాలు అన్నీ బ్లాగ్ లలో ఉన్నాయి. ఇక్కడ కి కొత్తగా ఎక్కడి నుండో.. రారు కదా! అనుకుంటాం. అంతే!
ప్రపంచం లో ఉన్న వికృతాలు అన్నీ బ్లాగ్ లలో ఉన్నాయి
నిజమండీ I agree with you!
ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయండీ..కొందరు బ్లాగర్లు కొన్ని బ్లాగుల్లో మాత్రమే కామెంట్ ఇవ్వటం...వాళ్ళు కామెంట్ ఇవ్వాలంటే
ఆ బ్లాగుకి,లేదా ఆ బ్లాగరుకి అదృష్టం ఉండాలి లేదా కొన్ని ప్రత్యేకమైన క్వాలిటీస్ ఉండాలి అన్నట్లు ప్రవర్తించటం..
కొత్త బ్లాగర్లు వాళ్ళ పాద స్పర్శ కోసం పరితపించిపోతున్నట్లు ఫీలవ్వటం కొందరి బ్లాగర్లలో కనపడే ఫీలింగో ఫోబియా..
ఎవడు కామెంట్ ఇస్తే ఏమిటి కామెంట్ ఇవ్వకపోతే ఏంటి కామెంట్ ఇస్తే గొప్ప పోస్ట్ లేకపోతే కాదా???
భజన చేయటం కంటే నిజాన్ని ఒప్పుకోవటం గొప్ప కదా..
సీనియర్ బ్లాగర్లు కొందరు కొత్త వాళ్ళకి కామెంట్స్ ఇచ్చి ప్రోత్సహించేవాళ్ళు వాళ్ళకి కూడా ఎవరో సలహాలు చెప్పారట అన్ని పోస్టులకి కామెంట్స్ ఇస్తే మీ వాల్యూ తగ్గిపోతుంది అందుకె ఎవరికి పడితే వాళ్ళకి కామెంట్స్ ఇవ్వొద్దు అని
good
నేను అనాలనుకున్న విషయాలన్నీ.. మీరు అనేసారు. ఒకరి మనోభావాలని ఎందుకు గాయపరచాలని నేను చాలా చూసి... మౌనంగా ఊరుకున్నాను. చాలా చాలా మంది గ్రూప్స్ మెయిన్ టైన్ చేస్తున్నట్లు ఉంటుంది.
చాలా సందర్భాలలో.. నేను చాలా నోచ్చుకున్నాను కూడా!
తమకన్నా చిన్నవారిని ప్రోత్సహించడం,బాగా వ్రాసినప్పుడు మెచ్చుకోవడం చేయడం వల్ల..నిర్మొహమాటం గా తప్పులని సరి చేసుకోమని చెప్పడం వల్ల .. ఎవరి విద్వత్తు తరిగి పోదు.
మనసులో కల్మషాలు లేకుంటే చాలు.
నిజమే నండి, మిక్చర్ బండి వాళ్ళం, తెనుగు సరిగా చదవను రాయనూ కూడా రాని వాళ్ళం బ్లాగులు రాసేస్తున్నాం. ఇంతకీ మేము ఉండచ్చా, పోవాలో తేల్చి చెప్పెయ్యండి.
>>>> వీలైనంత ఎక్కువగా మన గొప్పలు తరచుగా చెప్పుకుంటూ వుండాలి. ఉదాహరణకి నేను ఆఫీసుకి
కారులోనే వెళ్తాను అని చెప్పాలి నిజానికి బస్సులో వెళ్ళినా... ఎప్పుడైనా నోరు జారి ఈ రోజు బస్సులో అని
చెప్పినా సరదాగా అలా బస్సు లో వెళ్ళాలనిపించింది ఇవాళ అని కవర్ చేయాలి
:))) ఇది నా మీద సెటైర్ ?
మీ టపా మీద నా కామెంట్ : I agree.. ఎవరు ఏది రాసుకున్నా ఓకే..ఎవరి అభిరుచి వారిది. బ్లాగులన్నవి ఉన్నదే అందుకు..
జీడిపప్పు బ్లాగు లో నాకర్థమైనంత వరకూ ముఖ్యం గా లేవనెత్తిన సమస్య.. అగ్రగేటర్లలో, సరైన వర్గీకరణ లేకపోవటం వల్ల, కాపీ పేస్ట్ టపా లు ఎక్కువ గా ఉండి, భావ వ్యక్తీకరణ ఉన్న టపాలు త్వరగా మాయం అవుతున్నాయని.. సరిగ్గా ఆర్గనైజ్ చేస్తే.. ఈ సమస్య ఉండకపోవచ్చు. ఎక్కువ వెతుక్కోనవసరం లేకుండా ఎవరికిష్టమైన బ్లాగులు/టపాలు వారు ఈజీ గా వెళ్లి చదువుకోవచ్చు..
కృష్ణప్రియ గారూ అది మీ మీద సెటైర్ అని మీకనిపిస్తే నేనేమీ చేయలేను ఎందుకంటే ఇలాంటివి మన బ్లాగుల్లో చాలానే ఉన్నాయి..
ఇంక భావ వ్యక్తీకరణ అంటారా అదేమన్నా ప్రత్యేకమైన ఒక నైపుణ్యమా??? ఒక్కొక్కరు బొమ్మల్లో తమ భావాలను తెలియచేస్తారు,మరొకరు వాళ్ళకి ఇష్టమైన వంట గురించి చెప్పుకుంటారు,పాటల గురించి చెప్పుకుంటారు..
అందరూ భావ వ్యక్తీకరణ అని మనసులోని భావాలని వ్యక్తం చేయలేరు కదా...
ఉదాహరణకి వార్తా బ్లాగులు,కాపీ పేస్ట్ వీడియో బ్లాగులనె తీసుకుంటే
ఆ వార్త టీవీలో చూడని వాళ్ళకి ఉపయోగపడొచ్చు కదా...
అలాగే పాటల బ్లాగులు ఆఫీస్ లో పని చేసుకుంటూ ఎన్నోసార్లు
నేనే మన బ్లాగర్లలో కొందరి బ్లాగులోని సెలెక్టెడ్ సాంగ్స్ వింటూ ఉంటాను సంగీతం వినడం మంచిదె కదా...
అగ్రిగేటర్లలో కొందరి బ్లాగులు మాత్రమే రోజుల తరబడి కనపడాలంటే ఇంకెవరూ బ్లాగులు రాయకూడదని చట్టం తేవాలేమో మరి...
కష్టేఫలే గారూ ఈ మధ్యే ఒక బ్లాగులో ఒక పాట విన్నానండీ
ఈ లోకమొక ఆట స్థలము
ఈ ఆట ఆడేది క్షణము
ఇది తెలిసి తుది తెలిసి ఇంకెందుకు గర్వం
తన ఆటే గెలవాలని ప్రతి బొమ్మకు స్వార్ధం
సందీప్ గారూ,వనజవనమాలి గారూ,కష్టే ఫలే గారూ
మీ అభిప్రాయాలను బాగా తెలియచేశారండీ..
బ్లాగులంటే ఏమీ తెలియని రోజుల్లో కొత్త బ్లాగర్లుగా బ్లాగుల్లోకి వచ్చి
మనకి ఇష్టమైనవి మనం రాసుకుంటూ,కొందరు మిత్రుల సహకారం,మరికొందరి వ్యంగ్యాస్త్రాల నడుమ
ఈ బ్లాగు లోకంలో ఉన్నాము ఇప్పటి వరకూ....
ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే ఇప్పటి నుండి ఏమి రాయాలి??
మనం రాసే రాతల గురించి ఎవరేమి కామెంట్ చేసుకుంటున్నారు??
ఎగతాళి చేస్తున్నారు అని ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుందేమో..
ఏది ఏమైనా ఇతరులకి .. ఎవరికి నష్టం కష్టం కలిగించకుండా
ఎవరి భావాల్ని వాళ్ళు వ్యక్తీకరించే స్వేచ్చ అందరికీ ఉంది..
సందీప్ గారూ,
నిజమే ఎవరి బ్లాగులో వారు ఏదైనా రాసుకోవచ్చు. చదవటం చదవకపోవటం చదువర్ల ఇష్టం. జీడిపప్పుగారు ప్రధానంగా ప్రస్తావించింది ఆగ్రిగేట్లర్లలో ఉన్న బ్లాగుల వర్గీకరణ సమస్యని. కేవలం వార్తలు, పాటలకోసమే బ్లాగులంటే దానికన్నా ఈనాడు, ఆంధ్రజ్యోతి, యూట్యూబ్ అద్భుతంగా పని చేస్తాయి. పనికట్టుకుని ఇంటర్నెట్ స్పేస్ వాడాల్సిన పని లేదు. వార్తలకోసం బ్లాగులపై ఆధారపడాల్సిన అవసరం ఇంకా తెలుగువారికి రాలేదనే అనుకుంటున్నాను.
నేను విశేఖర్ గారి అభిప్రాయాలతో ఏకీభవించినా ఏకీభవించకున్నా ఆయన వార్తల బ్లాగంటే నాకు ఇష్టం. దానిలో ఆయన కేవలం వార్తలను అదించటం మాత్రమే కాకుండా ఆయన అభిప్రాయం ఏమిటన్నది తెలుస్తుంది. అలాగే ప్రతీవార్తకీ ఆయన కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతారు. మనం ఎక్కడున్నాం అనే విషయం తఱచి చూసుకోవటానికి పనికొస్తుంది. బ్లాగు ఉందికదా అని అలకటమే పనిగా పెట్టుకుంటామంటే ఎవ్వరం మాత్రం ఏమి చేస్తాం...?
అలాగే కొందరు బ్లాగర్లు చక్కని విశ్లేషణతో కూడిన టపాలు, సునిశిత విమర్శలు, ఆరోగ్యకరమైన హాస్యం, జీవితపాఠాలు ఇలా మనసుకు హత్తుకునేలా రాసేవారు అది ఇప్పుడు మందగించటమో, పూర్తిగా ఆపేయటమో జరిగింది. వారు మళ్ళీ రాయాలని కోరుకున్నారు తప్పించి కొత్తవారినెక్కడా విమర్శించినట్టు నాకు కనిపించలేదు.
రాజి గారూ ఎవరినో మెప్పించటానికో కామెంట్స్ కోసమో ఎవరూ బ్లాగులు రాయటం లేదు.. ఒకరి ఎగతాళి,వ్యంగ్యాల గురించి పట్టించుకోవాల్సిన
అవసరం లేదు అని నా అభిప్రాయం..
అచంగా గారూ ఏదైనా ఏమైనా చూసే వాళ్ళ కళ్ళను బట్టి వుంటుంది..
మీకిష్టమైన దాన్ని నేనెంత విమర్శించినా మీకు అదే నచ్చుతుంది..
అలాగే నాకు ఇష్టమైనదాన్ని మీరెంత విమర్శించినా నాకు అదే నచ్చుతుంది..అదే మనిషి తత్వం..
కొత్త బ్లాగర్లను తళుకుబెళుకు రాళ్ళు అని కామెంట్ ఇచ్చారు కాబట్టే నేను అన్నాను అంతే అనవసరంగా ఒకరిని నిందించాల్సిన అవసరం నాకు లేదు..
మంచి బ్లాగరలు మళ్ళీ రాయాలని కోరుకొవటంలో తప్పు లేదు కానీ ఈ కొత్త బ్లాగర్ల కారణంగానే మేము రాయలేకపోతున్నామని కొందరు బ్లాగర్లు అనటం బాగాలేదు..
సరే బ్లాగుల్లో వార్తలు వద్దు పాటలు వద్దు ఏమి రాయాలో ఎలా రాయాలో మీరనుకునే గొప్ప బ్లాగర్లతో ఒక లిస్ట్ తయారు చేయించి ఇవ్వండి అవే రాస్తూ మీ మెప్పుల కోసం ఎదురుచూస్తూ ఉంటాము..
సందీప్ గారూ,
కొందరివల్ల రాయలేకపోతున్నామని చెప్పబూనితే అది నిస్సందేహంగా పిల్లచేష్ట అనే అంటాను. అసలు వార్తలు, పాటలూ పోస్టు చెయ్యవద్దని చెప్పిందెవరు? వాటిపైన బ్లాగరు (రచయిత) వ్యాఖ్యానం ఏమిటన్నది ఇక్కడ ప్రధానం. అది లేకుండా అదే పనిగా పోస్టు చేస్తామన్నా అడ్డుచెప్పిందీ లేదు. అలాంటి బ్లాగులను వేరే టాబ్ కింద వచ్చేలా చూడమన్నారంతే! ఇక మిగిలింది మీ విజ్ఞతకే వదిలేస్తున్నా!
అలాగే తీర్పు తీర్చటం, మంచి బ్లాగర్లను (బ్లాగులను) ఎంచి చూపటం నా వ్యాఖ్య ఉద్దేశ్యం ఎంతమాత్రమూ కాదు. నా మెప్పు పొందినా పొందకున్నా జరిగేవి జరక్కమానవు. మీ టపాపైన నా అభిప్రాయం చెప్పటంవఱకే నా వ్యాఖ్యకు పరిధి.
సందీప్
నువ్వు (నువ్వు అనొచ్చు కదా :-) ) చెప్పిన చాలా విషయాలతొ నేనూ ఎకీభవిస్తున్నాను. గ్రూప్ లు, కొన్ని బ్లాగుల్లొ ఎం రాసినా అది సూపర్ , కెవ్ కెవ్ మనడం అవన్నీ కొత్తేం కాదు. ఒకసారి ఫ్రెండ్స్ అయ్యాక ఇవి సహజం అనుకుంటా.. ఉదాహరణకి మన ఇంట్లో వాళ్ళు, లేక స్నేహితులు ఒకమాదిరి విజయాలు సాధించినా ఆకాశానికి ఎత్తెయ్యడం సహజం కదా..
ఒక రెండు సంవత్సారాల క్రితం అప్పుడు కొత్తగా వచ్చిన జూ బ్లాగర్లు ఇంచుమించు ఇదే విధం గా ఫీల్ అయ్యేవారు. పెద్ద బ్లాగర్లు అంటే సొ కాల్డ్ స్టార్ బ్లాగర్లు అన్నమాట ..వాళ్ళు కొత్తగా వచ్చినవాళ్ళు ఎంత బాగా రాసినా ఎప్పుడూ ఎదొ రకంగా చిన్నబుచ్చే విధం గా ఎప్పుడూ ఏదో ఒకటి నెగటివ్ గా విమర్శిస్తూ కామెంట్స్ పెట్టేవారట . అప్పుడు ఆ జూ బ్లాగర్లలొ ఉన్న చాలా మంది ఇప్పుడు సీ బ్లాగర్లు అయ్యారు. అయితే అప్పట్లా చిన్న బుచ్చే కామెంట్స్ రాయడం లేదు ...అలా అని బాగున్న పొస్ట్లు కి కూడా కనీస స్పందన ఉండటం లేదు. అది కొంచెం బాధాకరమే. కానీ స్పందన డిమాండ్ చెయ్యలేం కదా...
ఇప్పుడు మనం తయారు చేసిన ప్రొడక్ట్ ఒకటి ఎంత నాణ్యమయినదయినా మార్కెట్ లొ ఎక్కువ అమ్ముడుపొవడం లేదు అంటే కారణం ఏమి అయి ఉంటుంది. దానికి సరి అయిన ఆడ్వర్టైజ్మెంట్ సరిగ్గా లేదనే కదా...అంటే వినియోగదారులకి అసలు మన ప్రోడక్ట్ ఒకటి ఉండనే తెలీడం లేదు. బయట ప్రొడక్ట్స్ కి ఆడ్స్ వేసుకొవడానికి టీవి లు, పత్రికలు లాంటి ప్లాట్ ఫారం ఉన్నట్టే బ్లాగులకి అగ్రిగేటర్స్ ఉన్నాయి ... ఆ అగ్రిగేటర్స్ లొ ఈ కొత్త బ్లాగరల పొస్ట్లు కనీసం ఒక గంట అయినా ఉండకపొతే ఎలా తెలుస్తుంది చెప్పు. కొన్ని బ్లాగులు పదే పదే చిన్న చిన్న పొస్ట్లు వేస్తూ మొత్తం అగ్రిగేటర్ ఆక్రమిస్తుంటే ఇక చిన్న బ్లాగర్ల పొస్ట్లు మిగతావారికి ఎలా తెలుస్తాయి.
ఉదాహరణకి : ఎన్నొ నెలల తరువాత నేను ఈ మద్య రెండు కామెంట్లు పెట్టాను. అలా పెట్టాలనిపించిన పొస్ట్ లొ ఈ పొస్ట్ ఒకటి . మరి ఈ పొస్ట్ నేను ఏ అగ్రిగేటర్ లొను చూడలేదు. చూసే అవకాసం రాలేదు. ఎవరొ చెప్తే నీ పొస్ట్ చూసాను. మరి ప్రతీసారి ఇలా ఎవరు చెప్తారు కొంతమంది బ్లాగులు చాలా బాగుంటున్నాయ్ అని.
ఇప్పుడు ఉన్న స్టార్ బ్లాగర్లు కొత్తగా బ్లాగుల్లోకి వచ్చినప్పుడు వాళ్ళు ఒంటరి వాళ్ళే. వాళ్ళు మొదట్లో ఇదే విధం గా ఫీల్ అయి ఉంటారు. రాసిన మొదటి పోస్ట్ నుండే స్టార్ అయిపోవడం సాధారణం గా జరగదు. ఇప్పుడు వాళ్ళ చుట్టూ ఉన్న గ్రూప్ వాళ్ళు స్లో గా డెవెలప్ చేసుకున్నదే. ఒకసారి స్టార్డం వచ్చాక ఇక ఫ్యాన్స్ భజన అలానే ఉంటుంది ... సినిమాల్లో చూడటం లేదు.. ఒకసారి స్టార్ అయ్యాక వాళ్ళు ఎంత చెత్త మూవీస్ తీసినా/చేసినా వాళ్లకి మినిమన్ కలక్షన్స్ వస్తాయి. చిన్న మూవీస్ ఎంత బాగున్నా వాళ్ళు కలెక్షన్స్ కోసం కొంచెం కష్టపడాలి. కాదంటావా ?
అయినా ఇది పెద్ద సమస్యే కాదు. ఏ అగ్రిగేటర్స్ లొ అయినా సింపుల్ గా రెండు పేజీలు పెట్టి ఒకదాంట్లొ న్యూస్ బేసెడ్ బ్లాగులు ఇంకొ దాంట్లొ సొంతం గా రాసే బ్లాగులు పెడితే ఎవరికి నచ్చింది వాళ్ళు చూసుకుంటారు. దీనికి ఒకరు బ్లాగులు రాయడం మానేయ్యాల్సిన అవసరం లేదు. ఎదుటి వారి మనొభావాలు నమ్మకాలు కించపరచనంతవరకూ ఎవరికి నచ్చింది వాళ్ళు రాసుకొవచ్హ్చు అందులొ అసలు చర్చించడానికి ఏమీ లేదు.
ప్రపంచం లో ఉన్న వికృతాలు అన్నీ బ్లాగ్ లలో ఉన్నాయి. అవును .. నిస్సందేహం గా..
ha..ha...baboy..yemi tution....fee yanta...)))
శశికళ గారూ మీరే టీచరమ్మ మీ దగ్గర ఫీ ఎందుకూ...
మీకు అంతా ఫ్రీ..... ఫ్రీ...... ఫ్రీ........
మంచు గారూ మీరు నన్ను నువ్వు అనొచ్చా అన్నారు కదా
ఒరేయ్ అరేయ్ అని తప్ప ఏదైనా అనొచ్చండీ.. :):):)
మీ విలువైన సమయాన్ని వెచ్చించి మీ అభిప్రాయాలను, సూచనలను తెలియచేసినందుకు ధన్యవాదాలు!
దేవుడా !
బ్లాగు సంసారం లో సన్యాసి వలె వర్తిస్తే
దేవుడు కనిపిస్తాడు ?!
సన్యాసి & సంసారి : ఒక బౌద్ధ గురువు శిష్యులకు ఇలా బోధించాడు, స్త్రీలను తాకరాదు, మాతృ భావంతో వారినుండి భిక్షను మటుకే స్వీకరించ వలెను అని, శిష్యు లిద్దరూ బోధ శ్రద్ధగా గ్రహించి వెళ్తూవుంటే మార్గ మధ్యం లో ఒక నదిని దాట బోతూ వుండగా చంటి పిండ్లవాడిని ఎత్తుకుని ఉన్న , ఒక నిండు గర్భవతియైన స్త్రీ మూర్తి ఆ ఇద్దరు భిక్షువులను ఇలా అడిగింది, "అయ్యా ! నా స్థితిని చూశారు కదా, ఈ నది ఈవేళ ఎందుకో ఉద్రుతముగా ప్రవహిస్తున్నది, నన్ను నది దాటిన్చరూ", అని వేడుకోగా!! అప్పుడు అందులో ఒకతడు ఆమెను తన రోడుచేతులతో మోసుకుని నది ఆవలి గట్టుకు తెచ్చాడు, ఇక వారిని అక్కడ క్షేమంగా దించాక ఇద్దరు భిక్షువులూ తమ తదుపరి ప్రయాణం సాగిస్తూ ఉండగా రెండవ భిక్షువు మొదటి భిక్షువుతో నువ్వు తప్పు చేసావు, గురువు గారు అస్సలు స్త్రీలను తాక వద్దన్నారు కాని నువ్వు మోసావు! అని అసహ్యించుకో సాగాడు, ఇతడి ప్రవర్తనకు అతడు జాలిపడి, మిత్రమా! నేను ఆ మాతృమూర్తిని ఆ రెండు నిమిషాలు మటుకే మోసాను కాని నీవు ఇంకా ఆమెను మోస్తూనే ఉన్నావు అని ఎరుక పరుస్తాడు!
మీ ఈ post ఎన్నో విషయాలను గమనింపులో పెట్టుకుని postings చెయ్యాలి అని తెలుస్తున్నది,
బాగుంది చక్కని సమీక్ష !!
నేను కొన్ని పద్దతులను అవసరమైనంత మేరకు మార్చుకుంటాను,
comments కూడా correct గా గుండె లోతుల్లోంచి వచ్చాయి
sorry for the late response
keep it up 'oh my friend'
:)
?!
@ ఎందుకో ? ఏమో !
మీ కామెంట్స్ కి, మీ చక్కని కధకి ధన్యవాదాలు!!
నా పోస్ట్ లన్నీ ఓపిక గా చూసి మీ అమూల్యమైన స్పందన తెలియచేయటం నాకు చాలా సంతోషం..
Thankyou verymuch 'oh my friend'
nice comments
కామెంట్‌ను పోస్ట్ చేయండి