తిండి కలిగితే కండ కలదోయ్ - కండ కలవాడేను మనిషోయ్!


కోటి విద్యలు కూటి కొరకే అన్నట్లు
మనిషి ఎంత సంపాదించినా, ఏమి చేసినా ఒక కంచండు అన్నం కోసమే
కదండీ
..ఎన్ని తులాల బంగారం ఉన్నా,ఎన్ని బీరువాలకి డబ్బులు ఉన్నా
టైం కి తిండి తినని వాడు దరిద్రుడే నా దృష్టి లో..
కొందరు ఉంటారు ఎంత సంపాదించినా ఏమున్నా సరైన తిండి తినలేరు పాపం.
మరి కొందరిని చూడండి తినటానికే పుట్టినట్లు రకరకాల వంటకాలు,
కాయలు
,పండ్లు ఫలాలు తినేస్తుంటారు.

నేను కూడా నా జిహ్వ చాపల్యాన్ని ఎప్పుడూ ఆపుకోనులెండి.
నాకు మేకాహారం , ఆకాహారం (ఆకు కూరలు) అన్న తేడా ఏమీ లేదు.
కాయలు,కాయల మీద పొట్టు,అరిటాకులు ,అరటి పూలు ,అరటి దూట,తీట
ఏదీ తినటానికి అనర్హం
కాదు నా దృష్టిలో..
ఎప్పుడూ నా నోటికి పని చెప్తూనే ఉంటాను.
నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరేమి అనుకున్నా గానీ..
ఎవరేమి అనుకుంటే నాకేంటి నా తిండే నాకు ముఖ్యం..

కొందరు నా తిండి చూసి కుళ్ళుకున్నా, కొంత మంది నా భజన ఫ్రెండ్స్ మాత్రం
మెచ్చుకుంటారు లెండి నన్ను ఆహా నా రాజా ఏమి తిండి తింటావురా నువ్వు!
ఇలాంటి తిండి తినే నువ్వు చాలా అదృష్టవంతుడివి రా అని.
ఇక్కడ బ్రహ్మానందం , శ్రీలక్ష్మి చూడండి తినటానికే పుట్టినట్లు
ఎంత హాయిగా తిండిని ఎంజాయ్ చేస్తున్నారో..







2 కామెంట్‌లు:

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

సందీప్ ..బాగా తిని.. బాగా వ్రాయండి. అల్ ది బెస్ట్.:)))

sandeep చెప్పారు...

Thankyou vanajavanamali garu :)

కామెంట్‌ను పోస్ట్ చేయండి