ఈ ఉత్తమ (ఉత్త ) బ్లాగుల గోలేందిరా బాబోయ్..


నేనే నెంబర్ వన్ వన్ వన్ అని అనుకోని వాడు ఎవడన్నా ఉంటాడా లోకంలో..
అలాగే బ్లాగు లోకంలో కూడా ఎవడి బ్లాగు వాడికి గొప్ప,ఎవడి టపా వాడికి గొప్ప చూస్తే చూడు లేకపోతె పో అంతే కానీ నేను కొన్ని బ్లాగులు ఉత్తమమని తీర్మానించా కాబట్టి అయ్యే గొప్ప మీరు కూడా చదవండి అంటే ఇదేదో బలవంతపు మత మార్పిడి వ్యవహారం లాగా వుందే..



ఒక సారి ఒక ఎల్లయ్య వస్తాడు ఒక పది భజన పరుల బ్లాగులు తెచ్చి ఇయ్యే ఉత్తమ (ఉత్త)బ్లాగులు అంటాడు.ఇంకోసారి ఇంకో మల్లమ్మ వస్తుంది నేను పడీ పడీ బ్లాగు లోకంలో సర్వే చేసాను కాబట్టి నా పదే ఉత్తమ (ఉత్త)బ్లాగులు అంటది.
ఇంతకీ బ్లాగులే ఉత్తమ బ్లాగులు అని నిర్ణయించటాని వీల్లెమన్నా బ్లాగు లోకపు చక్రవర్తులా,లేక దేవుళ్ళా?? లోకంలో ఎవరు గొప్ప ఎవరు తక్కువ అని దేవుడే ఆలోచించడు!! ఇలాంటి కుళ్ళు కుత్సితాలు నిండిన మనిషి మగానుభావులు తప్ప.
జాతి పక్షులు గూటికి చేరినట్లు జాతి కాకులకి జాతి కాకులే గొప్పేలే మరి ఏమి చేస్తాము??

ఉత్తమ బ్లాగులు సెలెక్ట్ చేసే ఉత్తములారా ఇంతకీ మీ లిస్టు లో సెలెక్ట్ కావాలంటే కావాల్సిన్ పెర్ఫామెన్స్ ఇండికేటర్స్ ఏంటో చెప్తారా?? మాకయ్యన్నీ ఎక్కడ ఎడ్సినాయి అంటారా??


మీతో
రోజూ ఆన్లైన్ లో మాట్లాడే వాళ్ళ బ్లాగులు,పర్సనల్ గా కలిసి ముచ్చట్లేసుకునే బ్లాగులు,బజ్జుల్లో బజ్జుకునే బ్లాగులు,ప్లస్సుల్లో ప్లస్సుకునే బ్లాగులు మాత్రమే మీకు ఉత్తమ (ఉత్త) బ్లాగులని బ్లాగు లోకమంతా కోడై కూస్తుంది..నంది అవార్డులిచ్చే దగ్గర మిమ్మల్ని కూర్చోపెడితే మంచిదేమో ఇప్పటి నుండి మంచి ఉత్తమ (ఉత్త) సినిమాలు సెలెక్ట్ చేయటానికి!!!

నా దృష్టిలో మాత్రం ఎవడి బ్లాగు వాడికే గొప్ప,ఎవడి పోస్టులు వాడికి గొప్ప, మంచి పోస్టులయ్యా ఎవడేమి అనుకుంటే ఎవడికేంది?? ఎవడి బ్లాగ్ ఎవడికో నచ్చకపోతే వచ్చే నష్టమేంది??
ఒక కోన్ కిస్కా గొట్టం గాడికి ఎవరి బ్లాగ్ అయినా నచ్చితే ఎంత నచ్చకపోతే ఎంత???


10 కామెంట్‌లు:

laddu చెప్పారు...

Agreed. well said.

sandeep చెప్పారు...

@ వంశీ కృష్ణ

Thankyou Friend..

జలతారు వెన్నెల చెప్పారు...

అమ్మో! రాంకింగ్ ఉంటుందని నిజంగానే నాకు తెలీదండోయి!

sandeep చెప్పారు...

అయ్యో జలతారు వెన్నెల గారూ మీకు తెలియదా???
మీ బ్లాగ్ కూడా సెలెక్ట్ అయ్యిందండీ ఉత్తమ బ్లాగుల లిస్టులో మీకు ప్రశంశాపూర్వక నగదు బహుమతిగా పది కేజీల """కాస్ట్లీ పప్పు"""
కూడా ఇస్తారు తీసుకోండి .. పండగ చేసుకోండీ..

రావెమ్మెస్సారెల్ చెప్పారు...

బాగుంది

sandeep చెప్పారు...

@ రావెమ్మెస్సారెల్ గారూ Thankyou

knmurthy చెప్పారు...

ఎవడి బ్లాగు వాడికే గొప్ప,ఎవడి పోస్టులు వాడికి గొప్ప, మంచి పోస్టులయ్యా ఎవడేమి అనుకుంటే ఎవడికేంది?? ఎవడి బ్లాగ్ ఎవడికో నచ్చకపోతే వచ్చే నష్టమేంది?? well said ఇష్టమైతే చూడటం కష్టమైతే మానుకోవడం మంచిది కదా

sandeep చెప్పారు...

knmurthy గారూ నా అభిప్రాయం మీకు నచ్చినందుకు.
స్పందించినందుకు ధన్యవాదాలండీ

భాస్కర్ కె చెప్పారు...

mastaaru please please naa blogni recomand cheyandi,
inthaki mee blog paristhithi emiti,

sandeep చెప్పారు...

మాస్టారూ మీరు మరీ అమాయకుల్లా వున్నారే ఎవడో మన బ్లాగ్ ని సెలెక్ట్ చెయ్యటమేంటీ???
నేను మీ బ్లాగ్ ని రికమండ్ చేయటమేంటీ???
మన బ్లాగ్ మనకే ఉత్తమ బ్లాగండీ.. అలాగే నా బ్లాగ్ కూడా నాకే ఉత్తమ బ్లాగు :)

కామెంట్‌ను పోస్ట్ చేయండి