నేను కవిని కాదన్న వాడిని కలంతో పొడుస్తా :):)

అందరూ కవితలు రాసేస్తున్నారు మరి నేను కూడా రాయకపోతే మనసులో ఎట్టేసుకుంటారు కదా నా సహచర బ్లాగర్లందరూ.. అందుకే ఈ నా కవిత ...


ఎవరు నువ్వు మిత్రమా!
గిరి గిరి మరి మరి తిరిగినా
నీ సరిలేని సిరి కానరాక
విసిగి విసిగి విధిరాతను ... విధాతను
అడిగి అడిగీ, కన్నీటితో కడిగి కడిగీ
నిరాశతో నేనున్నప్పుడు --
నిశార్ధ భాగపు నింగి నుండి
విశాల ఆర్ధ్రపు ఆత్మీయతతో
రాక రాక నీవు రాగ
అనురాగ రాగం గొంతుదాటి రాక
మత్తు నన్ను చిత్తు చేస్తున్నప్పుడు
గమ్మత్తుగా వచ్చి చిత్రంగా వెళ్లి పోయావేం
ఎవరు నువ్వు మిత్రమా??
వెంటనే వెళ్లావు అంత ఆత్రమా???


ఎలా వుంది నా కవిత! బాగా రాసాను కదా ???

7 కామెంట్‌లు:

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

రయోగ దశలో ఉన్నావు!అయినప్పటికీ నేను నిన్ను వండర్ ఫుల్ అని మెచ్చుకుంటాను.
ఎందుకంటె..అందరు అలా వ్రాయడం మొదలెట్టి.. అసలు కవిత్వం అంటే ఏమిటో..తెలుసుకునేసరికి జుట్టు ఆంతా తెల్లబడి మేధావి వర్గం అవుతారన్నమాట.
నేను కూడా అంతే ..సందేప్.దిగులు పడకు.
కీప్ ఇట్ అప్!!!

sandeep చెప్పారు...

వనజవనమాలి గారూ మీ ప్రోత్సాహానికి,మీ మొదటి ప్రశంశకు ధన్యవాదాలు!
ఐతే మీరు చెప్పినట్టు తలపండితేనే కవిత్వం వస్తుందన్న మాట..
మరి ఇప్పుడే నాకు తలపండితే నాకు పెళ్ళి కావటం కష్టం కదండీ
అందుకే కొంచెం కొంచెమే కవిత్వం రాస్తాను :):)

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

ప్రయోగ దశ నుండి..పరిణితి చెందిన దశకి త్వరగా ఎదగవద్దని నిర్ణయించు కున్నారన్నమాట.. అమ్మయ్య. ! నాకు పోటీ కవిత్వం తప్పింది:):)

sandeep చెప్పారు...

వనజవనమాలి గారూ పెళ్ళయ్యేదాకానేనండీ.. తర్వాత చూపిస్తా నా టాలెంట్ పెళ్ళైన తర్వాత నా జుట్టు తెల్లబడ్డా నా లవ్లీ ఏమీ చేయలేదు కదా నన్ను అందుకు :):)

జలతారు వెన్నెల చెప్పారు...

సందీప్... కవిత భలే రాసేసారే? వనజగారు అన్నట్లు వండర్ ఫుల్. ఇంతింతై, వటుడింతై లాగ మీరు కవితలు రాసేయ్యండి. మేము చదివి పెట్టేస్తాము. బ్రహ్మానందం గారు సిగ్గు పడడం నాకు తెగ నచ్చేసింది...

జలతారు వెన్నెల చెప్పారు...

sandeep, I remember commenting on your poem. Did you get that?

sandeep చెప్పారు...

జలతారు వెన్నెల గారూ, చాలా చాలా థాంక్సండీ మీ అభిమానంతో నన్ను మెచ్చుకున్నందుకు చాలా సంతోషం. ఇంక మీరు చెప్పారు కదా ఇప్పటి నుంచి కవితలు రాస్తాను లెండి:):)

కామెంట్‌ను పోస్ట్ చేయండి