
ఈ రోజు మదర్స్ దే అంటే నాకు మా ఫ్రెండ్ గాలి.మురారి గుర్తుకొస్తాదండీ..
ఎందుకంటారా నా స్నేహితుల్లో అందర్లో పరమ గాలి వెధవ ( మంచోడని చెప్తాననుకున్నారా?)..
వాడు చేసే గాలి పనులకి వాళ్ళ అమ్మ చెప్పు దెబ్బలు తినేది వూర్లో జనాలతో ..
మురారి గాడి అమ్మ హై వే రోడ్డు పక్కన ఉదయం ఇడ్లీలు,మధ్యానం బోండాలు అమ్మేది మరి రాత్రులు ఏమి అమ్మేదో కుటుంబ పోషణ కోసం..ఈ విషయం నాకంతగా తెలియదు కానీ మా వూర్లో జనాలు మాత్రం కధలు కధలు చెప్పేవాళ్ళు మురారి గాడి అమ్మ గురించి..
ఇంకా మురారి గాడు కొత్తల్లో సినిమాల్లోకి వచ్చినప్పటి అల్లరి నరేష్ గాదిలాగా చీకేసిన తాటికాయలాగా ఉండేవాడు.మురారి గాడు అమ్మ హోటల్ సంపాదన మీద బతికేవాడు కానీ మా కాలేజ్ లో మాత్రం వాడి ఫోజులు మాత్రం ఆ వూరి మోతుబరి రైతు కొడుకంత లెవెల్లో ఉండేవి.ఇంకా మురారి గాడు వాడి చిల్లర పనుల కోసం వాళ్ళమ్మ గుడిసె హోటల్ లో గల్ల డబ్బాలో డబ్బులు కొట్టేసి మా ముందు ఫోజులు కొట్టేవాడు.మేమంతా వాడి పనులకు వాడి ముందు ఏమనకపోయినా వాడి వెనక తెగ జోకులేసుకుని నవ్వుకునే వాళ్లము వాడి అతి వేషాలకి.
ఒక రోజు వాడి పైత్యం మరే పరాకాష్టకు చేరి మా వూరి కమ్మారి అమ్మాయిని వాణిని ఏదో అన్నాడు అంతే చీమలు పాకే చింత చెట్టుకి వాడ్ని కట్టేసి చింత బరికెలతో బాదారు పాపం...
అంతే వాడి వొళ్ళు అసలే వరద బాదితుదిలాగా ఉంటుందేమో,,, ఆ వాతలు తేలిన ఆ మురారి గాడి ఒళ్ళు చూడలేక భయపడి మా వూర్లో పిల్లలకు దడుపు జొరం వచ్చింది...
ఇంకొక రోజు డబ్బులు అవసరమయ్యి వాళ్ళ అమ్మ పాత గుడ్డలు తీసుకుపోయ్యి బుడబుక్కలాడికి అమ్ముకున్నాడు.అప్పుడు ఊరంతా ఈ మురారి గాడి కంటే ఆ బుడబుక్కలోడే నయంరా కష్టపడి పని చేసుకుని బతుకుతాడు అనుకున్నారు.ఇన్ని చేసినా వాళ్ళమ్మ వాడిని కాపాడుతూనే వుండేది పాపం.
కానీ తిట్టే నోరు,తిరిగే కాలు వూరుకోదన్నట్టు ఈ మురారి గాడు మళ్ళీ అమ్మాయిలని ఏదో గెలుక్కున్నాడు..
అంతే ఈసారి అవేర్నెస్ పెరిగిన అమ్మాయిలు ఈ మురారి గాడ్ని నాలుగు తన్ని,పోలీసులతో మరో నాలుగు తన్నిచ్చి ఖైదీ నెం 420 లా జైలు లో పెట్టించారు..
కానీ మా గాలి.మురారి గాడేమన్నా తక్కువ తిన్నాడా??
జైలులోనే దూర విద్యలో B.A చదివి,కంప్యూటర్ లో కూడా మిడి మిడి జ్ఞానం నేర్చుకున్నాడని మా ఊరంతా తెగ మెచ్చుకునే లోపే ఈ మధ్యే ఇంకో విషయం తెలిసింది..
ఆ నేర్చుకున్న కంప్యూటర్ మిడి మిడి జ్ఞానం తో ఇంటర్ నెట్ లో బూతు కధలు రాస్తన్నాడంత .
ఇది తెలిసిన నా స్నేహితులు నేను అనుకున్నాము వీడికి మళ్ళీ మురారి -- ఖైదీ నెం 420 అయ్యే రోజులు వచ్చినట్లున్నాయిరా అని ...
కానీ వాళ్ళ అమ్మ ఏమందో తెలుసా ఐతే ఏందయ్యా ఈ సారి నాకొడుకు జైలు లో దూర విద్యలో M.A కూడా చదివి వస్తాడు బయట వుంటే ఎలాగూ ఆ మురారి గాడు చదవడు కదా అన్నది..
వింటున్న నాకనిపించింది ఆహా ఇదేనా అమ్మ మనసంటే అని..
పాపం గాలి.మురారి గాడి తప్పు మాత్రం ఏముందిలే వాడి బ్రతుకు నెల మీద అయినా కలలన్నీ కలర్ ఫుల్లు పాపం..
అందరికీ Happy MoTher's Day


7 కామెంట్లు:
ఒరేయ్ """మురారి""" ఏటీ అనుకోమాకురా నీ బతుకు ఇలా హైవే మీద హోటల్ చేశానని.ఏదొ ఇవాళ అలా గుర్తుకొచ్చావు..ఇప్పటినుండి ఐనా ఆడవాళ్ళ తో తిట్లు,తన్నులు తినకుండా మర్యాదగా బ్రతకరా బాబు...
ఓ ..మంచి మెసేజ్ ఉంది. ఓ..తల్లి ఆకాంక్ష ఉంది. లేనిదల్లా.. మురారి గాడికి బుద్ది.(మీ స్టైల్ లో చేపాను)
మంచి పోస్ట్ సందీప్. చాలా బాగుంది.
"""లేనిదల్లా.. మురారి గాడికి బుద్ది.""""
అబ్బ వనజవనమాలి గారూ అచ్చం అమ్మ లాగే అన్నారండీ మీరు.. అమ్మ ఇంతే కదా కొడుకు ఎంత వెధవనైనా క్షమించేస్తుంది..
కానీ బయటి వాళ్ళు అలా కాదు కదండీ ఎంత పిచ్చి వేషాలు వేస్తే అంత మక్కెలిరుగుతాయి ఆ """మురారి""" గాడికి..
ఏమైన ఈ మదర్స్ డే రోజున మీ మెసేజ్ అందుకోవటం నాకు చాలా సంతోషమండీ..
lol nice post
♛ ప్రిన్స్ ♛ ,మా """మురారి""" గాడి గురించి చెప్పింది నచ్చినందుకు
ThankYou Friend.
అమ్మ బిడ్డల తప్పులన్ని కడుపులో పెట్టుకుని కాపాడుతుంది. ఎవరన్నా తన బిడ్డని ఒక్కమాట అంటే గాలి మురారి తల్లి సమర్ధించినట్టే సమర్ధిస్తుంది.మంచి పోస్ట్.ధన్యవాదాలు మీకు.
జలతారువెన్నెల గారూ తన తల్లి కూడా స్త్రీనేనన్న విచక్షణ వదిలేసి,పరాయి స్త్రీలను వేధించి,పైశాచికానందం అనుభవించె ఆ """గాలి.మురారి""" గాడి లాంటి వాడిని ఏమి చేసినా బుద్ధిరాదండీ..
అలాంటి వాడు వాళ్ళ అమ్మకే కాదు ఈ భూమికే భారం..
కానీ ఎదుటి వాళ్ళ మనసు గాయపడేలా చేసేవాడికి పతనం తప్పదు..
ఆ """గాలి.మురారి""" గాడు ఇప్పటీకైనా వాడి పశుప్రవృత్తి వదిలేసి మనిషిగా మారితే మంచిది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి