
ఊహను రూపంగా మలచగల ఒకే ఒక సాదనం చిత్రలేఖనం. ఈ కళకు పరిమితులు లేవు. మానవ చరిత్ర, సాంప్రదాయాలు, జీవనశైలి, వ్యవస్థ ఇలా దేనినైనా ఆవిష్కరించి మానవుని అభివృద్దిలో కీలకమైనది చిత్రలేఖనం. ఇలాంటి అద్భుతమైన చిత్రాలను సృష్టించేవారిని చిత్రకారులు అంటారు.
చిత్రాలలో రకాలు --
రేఖా చిత్రాలు ....
గీతలతో చిత్రించే అందమైన చిత్రాలు..
వ్యంగ్య చిత్రాలు (Cartoons) ....
మామూలు రూపురేఖలను సాగదీస్తే వచ్చే బొమ్మలనే వ్యంగ్యచిత్రం (క్యారికేచర్) అంటారు. మొట్టమొదటి క్యారికేచర్ విక్టోరియా మహారాణి గీసిందనే కథ ప్రచారంలో వుంది. ఒకసారి ఓ చిత్రకారుడు విక్టోరియా చిత్రాన్ని గీస్తూ అర్థంతరంగా వదిలిపెట్టిన చిత్రానికి మహారాణి వికారంగా వుండే ముక్కుని సాగదీసినట్లుగా నాలుగు గీతలు గీసిందట. ఇది చూసిన చిత్రకారుడు పకాపకా నవ్వాడట.
నీటి వర్ణ చిత్రాలు (Watercolor paintings)
నీటిలో కరిగే రంగులను ఉపయోగించి చిత్రించే చిత్రకళా విధానం (Watercolor painting).
తైల వర్ణ చిత్రాలు (Oil paintings)
ఆరిపోయే గుణం కలిగిన నూనెను మీడియం గా ఉపయోగించి వేసే రంగుల చిత్రాలు.
నాకు తెలిసి గొప్ప చిత్ర కారులుగా పేరెన్నిక గన్న కొందరు చిత్రకారులు అజరామరంగా ప్రజల గుండెల్లో నిలిచిపోయే చిత్రాలను చిత్రీకరించారు.అందమైన వారి ఊహలను కాన్వాస్ మీదికి ఎక్కించి, చూపరులను ఆనందాశ్చర్యాలలో ముంచటం ఈ చిత్రకారుల చతురత.
భారత్ :
రాజా రవివర్మ
ఎమ్.ఎఫ్. హుస్సేన్
జిమిని రాయ్
మన తెలుగు నాట
దామెర్ల రామారావు
కౌతా ఆనందమోహనశాస్త్రి
కౌతా రామమోహనశాస్త్రి
అంట్యాకుల పైడిరాజు
బాపు
వడ్డాది పాపయ్య
వరాహగిరి వెంకట భాగీరథి
వరదా వెంకటరత్నం
జయదేవ్
ఇంకా ఎవరైనా వుంటే మీరు చెప్పొచ్చు..
అసలు కధ.............
ఇప్పుడింతకీ ఇప్పుడు నాకు చిత్రలేఖనం గురించి ఇంత సడెన్ గా ఎందుకు గుర్తొచ్చింది అంటారా??
అదొక పెద్ద కధ ... ఒక పెద్ద పీడ ( చీడ) కల (కళ)..
మా చిన్నప్పుడు మా ఇంటి పక్కన ఇళ్ళకి రంగులు వేసే పైంటర్ ఎల్లయ్య వుండే వాడు... వాడికో కొడుకు వాడి పేరే
"వేణు మోహన్".చిన్నప్పటి నుండి వాళ్ళ నాన్న ఇళ్ళకి పైంట్లు వేసి మిగిలిన రంగులు,బ్రష్షులు ఓనర్లకి తెలియకుండా దొంగతనం గా తెచ్చుకునే వాడు ఇంటికి ... ఇంకేముంది వాటిని చూసిన మన వేణు మోహన్ కి పండగే పండగ.
ఆ మిగిలిన రంగుల్లో బ్రష్షు ముంచి ఎదురింటి.పక్కింటి గోడలమీద కుడ్య చిత్రాలు గీసి ఆ ఇళ్ళ వాళ్ళతో తన్నులు తినేవాడు వెధవ... వాళ్ళ నాన్న కూడా అరేయ్ నా కొడకా ఎందుకురా అట్లా జనాలతో తన్నులు తింటావు?? శుభ్రంగా నాఎమ్మటి అచ్చి (వచ్చి) గోడలకి సున్నాలు ఎయ్యటం నేచుకోరా అనేవాడు..కానీ వీడు వింటేనా???
ఎలాగోలా ITI పాసయ్యి రైలో డ్రైవర్‌గా ఉద్యోగం ఎలగాబెడతన్నాడు. అయినా కళ మీద ఆసత్తి పోలా మా వేణుమోహన్ కి ఎప్పటికైనా మంచి చిత్రకారుడని అయ్యి m.f హుసేన్,రవి వర్మ లాగా పైకి పోవాలని పిచ్చి కోరిక పిచ్చోడికి. ( పైకంటే ఆ పైకి కాదండోయ్ :) )
ఇప్పుడింక ఆ ఆసక్తిలో భాగంగా రైలు డ్రైవర్ గదా రైలు నడుపుతా నడుపుతా వదిలేసి,బొమ్మలు గీస్తా వుంటే రెండు మార్లు జనాలు సావబోయ్యి బతికారంటా ... సస్పెండ్ చెయ్యాలనుకుని కూడా వెధవ వేణు మోహన్ గాడు తిండికి సస్తాడని జాలిపడి వుద్యోగం ఉంచారు పాపం పైవోళ్ళు..
ఇంకా వ్యంగ్య చిత్రాలు అయ్యేంటీ కారికేచర్లంట వాళ్ళ ఇంటి పక్కనోల్లయి,వాళ్ళ తోటి డ్రైవర్ల ని , ఆఫీసర్లని ఒక్కళ్ళని వదలకుండా ""అందరి మొహాలూ ఒకేలా""" ఉండేలా కారికేచర్లు గీసాడంట... ఆల్లంతా ఈడి ముందు ఆహా ఓహో అని మెచ్చుకుని,చాటున వీడి బొంద ఒక్కళ్ళ మొహమన్నా వాళ్ళ మోహంలో పోలికలున్నాయా అని నవ్వుకోలేక చచ్చారంట. వీడి పైన్టింగులకి ఇంకో ప్రత్యేకత ఎవరి బొమ్మ గీసినా మొహం ఒకేలా వుండటం :):)
ఇంక మొదలు పెట్టాడయ్యా పురాణ పాత్రలూ, దెయ్యాలూ,భూతాల బొమ్మలు అయ్యి చూసి వాడి పిల్లలకే దడుపు జొరం వచ్చిందంట ఇంట్లో వాడి పెళ్ళాం ఒకటే గోల నీ పాడు గాను ఏందిరా నీ పిచ్చి బొమ్మలు డబ్బులన్నీ ఆ కాగితాలకి,పెన్సిల్లకి తగలేస్తాన్నావు అని గోల గోల వీధంతా..
వీడు వేసే బొమ్మలు నిజంగా బాగుండకపోయినా వాడు పోయించే టీ నీళ్ళకి, వాడి పార్టీలకి వాడి చుట్టూ ఆడ,మగ ఫానులు చేరి వాడిని ఆహా ఓహో నీ అంత చిత్రకారుడు లేడని పొగడటం మొదలు పెట్టారు..
కొంతమందేమో పిచ్చి నాకొడుకు ఈడితో మనకెందుకులే ఏదో బాగుందని చెప్తే పోలా అని వాడి ముందు బాగా వేసావయ్యా బొమ్మలు అనే వాళ్ళు.ఇంక అంతే మన వేణు మోహన్ గాడి కళ్ళు నడినేత్తికేక్కాయి
నాకేంది నేను గొప్ప పైంటర్ ని అన్న అహంకారం వచ్చింది వాడికి..

ఎవరైనా పాపం ఏదో కొంచెం తప్పులున్నాయని చెప్తే చాలు వాళ్ళని నానా తిట్లు తిట్టి అవమానించేవాడు గాలి వెధవ లాగా..
పాపం మా బజార్లో ఒక పెద్దామె ఆ బొమ్మ ఇలా కాదయ్యా ఇంకోలాగా వేస్తె బాగుంటుందేమో అని ఏదో చిన్న మాట అన్నదంట .. అంతే ఈ వేణు మోహన్ గాడు ఆమెని పెద్ద మనిషి అని కూడా మర్యాద ఇవ్వకుండా వాడికి తగ్గ "మిఢతం బొట్ల" గాళ్ళ పేర్లు ఒక 3,4 పేర్లు చెప్పి వాళ్ళు చెప్తే నేను వింటా గానీ నువ్వెవరమ్మా చెప్పటానికి నువ్వేమన్నా గొప్ప పైంటర్ వా అని వెధవ వాగుడు వాగి ఆమెని బాధ పెట్టాడు పాపం..సాటి మనుషుల్ని గౌరవించే సంస్కారం వుంటే కదా వెధవకి..
మా వేణు మోహన్ గాడికి ప్రసంసలె కానీ విమర్శలు పనికిరావంట.. అందుకే నీ వెనక ఒక పది మంది భజన సంఘాన్ని పెట్టుకో అప్పుడు వాళ్ళైతే నువ్వే చెత్త పని చేసినా మెచ్చుకుంటారు
ఒరేయ్ వేణు మోహన్ వెధవా నువ్వు గీసే పనికి రాని పిచ్చి గీతలు గురించి కామెంట్లు ఇవ్వటానికి నీకోసం రవివర్మలు, పికాసో లు వస్తారనుకున్నావా నిన్ను మెచ్చుకోవటానికి???
ఒక పని చెయ్యి నువ్వేసే పిచ్చి బొమ్మలన్నీ కట్ట కట్టి నువ్వు పైకి వెళ్ళేటప్పుడు తీసుకు పో అప్పుడు వాళ్ళు మెచ్చుకుంటారు నీ ప్రతిభ చూసి సరేనా???

ఏ కళాకారుడికైనా విమర్శలే వారు ఇంకా ఎక్కువ నేర్చుకోవటానికి పనికి వస్తాయి..
అంతే కానీ భజన పరుల మెచ్చుకోళ్ళు వింటూ నీ గురించి నువ్వు ఏదో ఊహించుకుంటే చివరికి నువ్వు కూడా మీ నాన్న ఎల్లయ్య లాగా ఇళ్ళకి సున్నాలేసుకోవాల్సిందేనయ్యా .... వేణు మోహనా....
విద్య వల్ల వినయం రావాలి కానీ ఒళ్ళు బలుపు కాదు..
ఇప్పటికిన్తేనయ్యా వేణు మోహన్ కధ అయిపోయిన్దయ్యా... ఏమన్నా సంగతులుంటే మళ్ళీ చెప్పుకున్దాంయ్యా..


39 కామెంట్లు:
మీరు ఇలా కౌన్సెల్లింగ్ చేస్తూ ఉంటారని తెలిస్తే నేనూ కొంతమందిని పంపించేదానిని కదండీ :) ఇంకా ఎవరయినా గొప్ప చిత్ర కారులు ఉంటే చెప్పచ్చు అన్నారు కనుక నాకు తెలిసిన మరికొంతమంది పేర్లు చెప్తాను. అనూప్, ఇళయరాజా, గోపాల్ స్వామి ఖేతంచి, శుచి క్రిషన్, రామ సురేశ్, ఇలా ఉన్నారు. వీరి గురించి నా బ్లాగులో పరిచయం చేశాను. వారి చిత్రాలు మీరు అక్కడ చూడచ్చు. ఇక్కడ మీరు వ్రాసిన వాటిల్లో కత్తితో గీసే చిత్రాల గురించి వ్రాయలేదు అన్నీ కుంచెతో గీసేవే వ్రాశారు. రామ సురేశ్ గారు కత్తితో చిత్రాలను బాగా వేస్తారు.
హహ సూపరో సూపర్ !! ఈ వేణు మోహన్ కి ఒళ్ళంతా కొవ్వే . చింత బరికెలు, బెత్తాలు, ఏవో ఏవో మాట్లాడుతాడు. తాబట్టిన కుందేలు కు మూడే కాళ్ళు అనే రకం.
వీడికి ఓ భజన సంఘం , వీడు తాన అంటే తందాన అనడానికి రెడీగా ఉంటారు. అయిన వీడి కాంమేన్ట్లకి బయపడే సగం మంది వీడి గురించి పోగుడుతారని నా అనుమానం.
వీడి ప్రతి పోస్టుల్లోనూ ధ్వనిచే వెటకారం ??!!?? , చదివే వాళ్ళందరు తెలివి తక్కువ వాళ్ళని అనుకునే మూర్కుడు వీడు. అప్పుడెప్పుడో ఏదో పెద్దాయన అయన పాటికి అయన ఏదో జ్యోతిష్యం మీద
ఏదో ఆర్టికల్ రాసుకుంటే... దాని పై వీడు రాసిన వ్యంగ్య రచనకి వీడికి పడిన అక్షింతలు దానికి వీడి సమాధానాలు.. అబ్బో పెద్ద తల తిక్క వెధవా ?? దూరంగా ఉంటె మంచిది.
అయినా బొమ్మ బాగుందో లేదో చెప్పడానికి బొమ్మలు గీయడం రావాలా ?? హహ !! వీడి లాజిక్కు , ఏడిసినట్టుంది.
రసజ్ఞ గారూ, అంతేనంటారా!!అలాగే పంపిచెయ్యండి తొందరగా కౌన్సిలింగ్ ఇద్దాము..
మంచి """నిజమైన పైంటర్స్"""" ని మీరు పరిచయం చేస్తారండీ
నాకు తెలుసు కదా మీ పోస్ట్లన్నీ చదువుతాను, కత్తి పైంటర్ ని గురించి కూడా చూశానండీ చాలా బాగున్నాయి ఆయన చిత్రాలు కూడా..
Thankyou!!!
netiszen గారూ, మా వేణూమోహన్ మీకు తెలుసా ఆయనకింత ఘన చరిత్ర వుందని తెలియచేసినందుకు ధన్యవాదాలండీ..
"అయినా బొమ్మ బాగుందో లేదో చెప్పడానికి బొమ్మలు గీయడం రావాలా ?? హహ !! వీడి లాజిక్కు , ఏడిసినట్టుంది."
మంచి మాట చెప్పారండీ...
మీరన్నట్లు తనకు కొవ్వు,బలుపు,తిక్క అని ఆయనంతట ఆయనే ఒప్పుకున్నాడు లెండి..
సందీపు, మాటల్లేవు ఇంక...అహంకారం వంటికి అంత మంచిది కాదు. ఎదిగిన కొద్దీ ఒదగాలి అన్నది కూడా తెలియదు అనుకుంటే జాలి గా ఉంది.
((((ఇంకో 13 రోజుల్లో 5 సంవత్సరాలు నిందబోతున్నాయి మీ blog కి నాకు తెలిసి top most సీనియర్ బ్లాగర్ మీరు !!
మీ posts చాల చూశాను
బహుసా ! మీరు ఈ వేల ఆవేశం తో ఉన్నట్లు ఉన్నారనుకుంట
సాధారణంగా ఈ విధమైన arts గీసే వారికి బుద్ధి బలం బాగా ఉంటుందని
రామకృష్ణ mission వారి బుద్ధి యోగం అనే పుస్తకం లో చదివాను,
మీకో చిన్న మనవి,
పైన VVVVVVV వారి comment చదివి
దానికి ప్రతి గా వచ్చిన reply ని పక్క పక్కన పెట్టి compare చేస్తే
మీ స్పందన కాస్త నొచ్చుకునేలా ఉన్నది,
నిజమే ఒక కళా కారుడి హృదయం నిజంగా మరో కలాకారుడికే తెలుస్తుంది,
కాని ప్రశంశ నే కాక విమర్శని కూడా సహృదయం తో స్వీకరించా గలిగితే మీ ఔన్నత్యం పదింతలు అవుతుంది,
ఫలితంగా మీ ద్వారా ప్రకాశించ బడుతున్న మీ కళకి అది సహాయ కారి అవుతుందని పిస్తోంది.
మీ XXXX ఆ blog title లోనే ఏదో మహత్తు ఉన్నట్లు అనిపిస్తుంది
అందుకే తమరి ఉద్వేగాన్ని ఆభాషలో వ్యక్తం చేయక
ఆంగ్లం లోనే వెలిబుచ్చారు
కాని
అవును ఇది మీ టపాకి విరుద్ధమైన comment but
మీరు ఇక్కడ post చేయకున్ననూ మీకు నా భావం అందుతుంది కదా!
అది చాలు
నేను మీ blog లో పెద్దగా comments చేసి మీకు నా ఉనికిని చూపి ఉండక పోవచ్చును గానీ
కొన్ని posts ని చూసి ఆస్వాదించిన అభిమానులలో నేను ఒకడనే!
మీరు ఒక మారు పునరాలోచన చేయమని నేను అనటం లేదు,
కాని
అలా చేస్తే బాగుంటుంది అని చెప్తున్నాను
ఎంచేత అంటే! ఒకరు మరొకరి పట్ల చొరవతో వ్యవహిస్తున్నారంటే
అది అభిమానమే (నా అనే భావమే) వారిచేత అలా చేయింప గలుగుతుందని మాత్రం నాకు తెలుసు!
మాకు YYYYYYYY గారు ఇలానే కావాలి
యాగంటి నరసిమ్హునిలా కాదు సుమా!
అలాగే మీకు వీలు కుదిరి నప్పుడు ఎందుకో? ఏమో ! శివ పైన కూడా ఒక fun toon ప్రసాదించగలరు !!
సరే!
మీ చిత్రం ఔన్నత్యం మీకు తెలిసినప్పుడు
ఎవరైనా ఎమన్నా అంటే దాని ఔన్నత్యానికి భంగం వాటిల్లదు కదా!
తెలిసిన వారు తెలియని వారాలకు తెలిపిడి చేస్తే ...
తెలుసుకోవటం అనే ప్రక్రియ జరుగుతోంది
అనాది కాలం నుంచి అనంతం వరకు...
సరే !
మీకు కృతజ్ఞతలు
సాయిరాం !!
)))))
Yesterday I typed the above comment for your friend, but I didn't post this,
Okay now I got a chance to send my msg may be It will also gives some worth to your post.
Hope you & your ZZZZ understand this.
?!
actually అక్కడ ఈ comment వస్తుందని నాకు నమ్మకము లేదు
కాని మనసు బాధ పడినప్పుడు స్పందిస్తే అది సహజం
ఇతరుల ను నొప్పించినప్పుడు మటుకు స్పందిచక ఊరక ఉండటం అసహజం
అశోకుడు చేసిన తప్పు అదే ...
హిందూ మతం ఎప్పుడు అహింస కు విరుద్ధ మైన పనులు చెప్పలేదు
అలా అని ధర్మాగ్రహం కూడా ధర్మమే అని చెప్పింది.
నేను ఈ comment ని కోపం తో రాయల ధర్మాగ్రహం తోనే రాసాను
ఇది ఇలా బహిరంగంగా తెలపటం నాకు ఏమాత్రం ఇష్టం లేదు
కాని ఆడవాళ్ళని అందరి ముందూ అలా విమర్సిశ్తే ఏమౌతుందో తెలియాలి అని comment చేస్తున్నాను ఇక్కడ!
Oh my friend సందీప్ ! understand my feel
To
Oh my friend సందీప్ ! understand my feel
నీకు కూడా ఉన్నది కోపం కాదు, నీలో ప్రేరణ గా నిలచిన భావం ధర్మాగ్రహం వలన కలిగినదే అని గుర్తించు.
సామాన్యుడు సాటి మనిషిని చంపితే తప్పు
అదే యుద్ధం లో సైనికుడు ప్రత్యర్థిని కుక్కను కాల్చి నట్లు కాల్చినా
అది యుద్ధ ధర్మం అవుతుంది,
fight with Dharma my boy
Good luck
hahahaha emannaa creat naa lol chaalaa bagundi....
@ ఎందుకో ? ఏమో ! - ఆ బ్లాగ్ లో కామెంట్ పెట్టాలి అంటే, అయితే భలే భలే పొగడండి లేదా వారు గౌరవించే ఆ "మిఢతం బొట్ల" జాబితాలో మీరు ఉన్నారేమో చూసుకోండి.
అంతే కాని తప్పి పోయి కూడా ఆ బ్లాగ్ లో కామెంట్ పెట్టకండి.
విద్య లేని వాడు వింతపశువు అనే వాళ్ళు ఒకప్పుడు కానీ ఇప్పుడు
సంస్కారం లేని వాడి విద్య పిచ్చోడి చేతిలో రాయి లాగా తయారయ్యింది..
ఎవరైనా ఏదైనా మాట చెప్పినప్పుడు మనకి ఇష్టం లేకపోతే ఆ మాటకు రెస్పాన్ ఇవ్వకపోవటం మన ఇష్టం... కానీ ఎదుటి మనిషి మనసును గాయ పరచటం అహంకారం..
జలతారువెన్నెల గారూ,Thankyou very much :)
"Okay now I got a chance to send my msg may be It will also gives some worth to your post."
హాయ్ డియర్ ఫ్రెండ్ ఎందుకో ? ఏమో !
I Agree With you and thankyou!!
మీరు చెప్పాలనుకున్నది నా బ్లాగ్ ద్వారా చెప్పినందుకు చాలా సంతోషం..
విద్యా దదతి వినయం,
వినయ దదతి పాత్రతాం,
పాత్రత్వ ధనమాప్నోతి,
ధనత్ ధర్మం తతత్సుఖం.
అన్నారు పెద్దలు ( ఏదైనా తప్పులుంటే సారీ )
నా ఆగ్రహానికి అర్ధం తెలుసుకున్నందుకు మీ మంచి మనసుతో నన్ను ఆశీర్వదించినందుకు థాంక్యూ ఫ్రెండ్..
నేను చేసింది మంచి పనే అని నాకు నాపై నమ్మకాన్ని కలిగించిన
మీ అందరికీ నమస్సులు.. ఈ లోకం లో ఇంకా మానవత్వం వుంది అనటానికి, మీ లాంటి స్నేహితులు కొందరైనా వున్నందుకు చాలా సంతోషం..
తప్పుని తప్పు అని చెప్పటం వలన వచ్చే నష్టం ఏమిటి??
మహా ఐతే నన్ను తిడుతూ ఇంకొక పోస్ట్ వేస్తారు,లెకపొతే ప్లస్సుల్లోనో చాటింగుల్లోనో ఎక్కడొ నా గురించి చెప్పుకుంటారు..
దాని వలన నాకేంటి నష్టం.. అందుకే నేను తప్పుని తప్పు అనే అంటాను.. ఆ దేవుడి అండ నాకున్నంతవరకు ...
ThankYou Friend!!
♛ ప్రిన్స్ ♛
పోస్ట్ మీకు నచ్చినందుకు,మిమ్మల్ని నవ్వించినందుకు థాంక్యూ
Friend :)
సందీప్ గారు ఒక మంచి వీడియో దొరికింది పోస్ట్ చేశాను ఒకసారి చూడండి
:)
" నేను తప్పుని తప్పు అనే అంటాను.. ఆ దేవుడి అండ నాకున్నంతవరకు " interesting
?!
"కరుణించిన ఆకాశం" కళాఖండం అదిరిందయ్యా ప్రిన్సూ... :):)
@ ఎందుకో ? ఏమో !
Thankyou Friend :)
ఆహా ఏమి పోస్టు స్వామీ మిత్రుడి కౌశల్యం పై!
మీ మిత్రుడి కి శుభాకాంక్షలు సుమీ అయినా మీ మిత్రుడు వేణు గోపాల్ వినే రకమంటారా ? చెబ్తే తల తిక్క మనిషి కాడూ ?
చీర్స్
జిలేబి.
Zilebi గారూ, ఎన్నాళ్ళకెన్నాళ్లకు అంతా కుశలమే కదా!!
మా మిత్రుడి కౌశల్యం గురించి నా పోస్ట్ నచ్చినందుకు ధన్యవాదాలు :)
మంచి చెప్తే వినటం, వినకపోవటం అంటారా ఇంక ఎవరి ఖర్మ వారిదే :)
Thankyou!!
@ జిలేబి जी !
మీరు గతం లో ఒక post లో ఇలా రాసారు కొన్ని బ్లాగుల్లో comment పైన ఇలా ఉంటుంది.
ఊరు పేరు etc లేని వాళ్ళు no need to post here etc అది correct కాదు
10 మంది commenters కి నచ్చక పోతే ఆ post delete చేసే facility ఉంటె It will sounds good అని
exact words match అవ్వటం లేదు hope I expressed some what I remembered /////
అప్పుడు ఏంటి ఇలా అంటారు వీరు, ఎవరి blog వారిష్టం కదా! అనుకున్న కాని
నిన్న నేను ఆ particual post ని చదివి నప్పుడు మీ పాత post జ్ఞాపకం వచ్చింది.
నిజమే మీరు అప్పుడు చెప్పింది.
we need to oppose this type of things
మొన్న mothers day పుణ్యమా అని మొన్నే తెలిసింది సప్త మాత్రుకలను దూషణ chesthe emouthundo అని
veelaithe naa blog pai oka look veyandi
sare thanks for this
మొన్న mothers day పుణ్యమా అని మొన్నే తెలిసింది సప్త మాత్రుకలను దూషణ chesthe emouthundo అని
veelaithe naa blog pai oka look veyandi
sare thanks for this
?!
జిలేబి గారు బొమ్మ గీయించుకోవడానికి చాల తంటాలు పడ్డారు. వీరు అడగటం అతడేమో తల తిక్క సమాదానలతో రిప్లై ఇవ్వడం.
నాకు బాగా గుర్తుంది. అయిన అన్ని ఉన్న విస్తరాకు అణిగి ఉంటుంది. ఏమి లేనిదే ఎగిరెగిరి పడుతుంది.
ఇంటర్ లో చదివిన ఒక పద్యం గుర్తొస్తుంది. అన్ని తెలిసినవాడికి, ఏమి తెలియని వాడికి వివరించి చెప్పొచ్చు. మిడి మిడి జ్ఞానం తో ఎగిరే వారికి ఏమి చెప్పలేము.
తెలియని వారికి చేపోచ్చు, తెలిసిన తెలియనట్లు నటించే వారికి చెప్పలేము గా.
చెప్పితే వినక పొతే వదులుతామా చిన్నప్పుడు స్కూల్ కి పోను అని మారం చేస్తే కొట్టి అయినా పంపలేదా? మనము అంతే... ఎంత అయినా మన ఫ్రెండ్ నే కదా! మనమే బాగు చేసుకుందాం
సందీప్ గారు..మీ బ్లాగ్ లోకి వస్తే చాలా విషయాలు తెలుస్తాయి. మీరు 5 సంవత్సరాల సీనియర్ బ్లాగారా! అయ్య బాబోయి. !!
ఏమైనా మీ ఈ పోస్ట్ అజ్ఞానం మీద,కుసంస్కారం పైన అన్నమాట. ఎవరు అలా ఉన్నా చురకలు వేయాల్సిందే!
మీ ఈ పోస్ట్ చూసాక నాకు ఒకటి తోస్తుంది.నేను జస్ట్ ఎ కామన్ వుమెన్. ఇంకా చెప్పాలంటే..ఏదో కుట్లు,అల్లికలు,అద్దకాలు వేసుకుంటూ..ఓ పది మందికి కుటుంబాలకి ఊతంగా ఉన్నదానిని.
అనవసరంగా ఈ బ్లాగుల్లోకి జొరబడి.. చదివి..అత్యుత్సాహంలో కామెంట్ పెడుతుంటాను. అలా పెట్ట కూడదని తెలిసాక చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏం ప్రయోజనం అని వగచి..బాధ పడను..
ఎవరి జ్ఞానం లెవల్ ఏమిటో..ప్రపంచం చూస్తుంటుంది. చిరునవ్వుతో.. నేను చూస్తుంటాను.
"జ్ఞాన సముపార్జనం కన్నా హృదయ సంస్కారం మిన్న " అది భగవంతుడు అందరికి ఇచ్చి ఇతరుల పట్ల సహృదయం తో మెలగాలని కోరుకుంటూ..
ఈ పోస్ట్ లో మీ బజార్లో ఓ..పెద్ద ఆమె కి .. నా సానుభూతిని తెలుపుతూ.. అమ్మా ! మూర్ఖులని,ఆహంకారులని,జ్ఞానులం అనుకుంటున్న వారి అజ్ఞానాన్ని మన్నించు తల్లి! అని కోరుకుంటూ...
చురకత్తి లాంటి . పోస్ట్ వేసినందుకు.. మెచ్చి అభినందన మందారమాల. (సీనియర్ బ్లాగర్ గా ) మీ బ్లాగింగ్ కి ధన్యవాదములు
@ ఎందుకో ? ఏమో !
"we need to oppose this type of things"
జిలేబీ గారి ఆలోచన నిజంగానే బాగుంది!!
Thankyou!!
"అన్ని తెలిసినవాడికి, ఏమి తెలియని వాడికి వివరించి చెప్పొచ్చు. మిడి "మిడి జ్ఞానం తో ఎగిరే వారికి ఏమి చెప్పలేము.
తెలియని వారికి చేపోచ్చు, తెలిసిన తెలియనట్లు నటించే వారికి చెప్పలేము గా."
netiszen గారు..మంచి మాట చెప్పారండీ..
♛ ప్రిన్స్ ♛
Friend ఇప్పుడే "netiszen" గారు చెప్పారు కదా,
"తెలియని వారికి చేపోచ్చు, తెలిసిన తెలియనట్లు నటించే వారికి చెప్పలేము గా."
@ వనజవనమాలి గారూ,5 సంవత్సరాల సీనియర్ బ్లాగర్ నేను కాదండీ!!
నా ఫ్రెండ్ వేణు మోహన్ ..
వేణు మోహన్ "ఆ పెద్దామెని" అన్నందుకు ఫీల్ అయిన
"ఎందుకో ఏమో" గారు నా ఫ్రెండ్ వేణుమోహన్ కి చెప్పాలనుకున్న మెసేజ్ ని ఇక్కడ చెప్పారన్నమాట..
అజ్ఞానం మీద,కుసంస్కారం పైన నేను వేసిన చురకలు మీకు నచ్చినందుకు,మీ అభినందన మందార మాలకు ధన్యవాదాలు..
చెడుకి వ్యతిరేకంగా మీరందరూ ఒక మంచి విషయాన్ని ధైర్యంగా సపోర్ట్ చేయటం నాకు చాలా సంతోషమండీ..
మంచిని మెచ్చుకుంటూ కామెంట్ చేయటం మన మంచి అలవాటండీ దాన్ని ఎదుటివాడు ఎలా స్వీకరిస్తాడనేది వాళ్ళ విజ్ఞత మీదే ఆధారపడి వుంటుంది..
అమ్మా ! మనం మంచి చేస్తున్నామన్న నమ్మకం మనకి వున్నప్పుడు ఎవరు ఏమనుకుంటే మనకెందుకండీ.. పది మందికి ఉపాధి కల్పిస్తూ మీ ప్రవృత్తిని మీరు కొనసాగిస్తూ ఎప్పుడూ మీ కుటుంబంతో, మీ బాబు తో హాపీ గా వుండండి..
/వేణు మోహనా....విద్య వల్ల వినయం రావాలి కానీ ఒళ్ళు బలుపు కాదు../
వహ్వా... వహ్వా.. మొదట్లో అర్థం కాలేదు, కామెంట్లు తిరగేశాక విషయం అర్థమయ్యింది. :)
బలుపే ఆ వేణు మోహనుడి కున్న విద్య అదేనేమో. మిడతంబొట్లు అంటే ... ఆ తందానతాన నశ్యం మేస్టార్లేనా? ;) హా హా హా
మన వేణు మోహన్ బొమ్మలకి అః ఓహో అని పొగిడే బ్లాగ్ పెద్ద మనుషులు, ఈ టపా చూసి, కంమెంట్లు చదివి కూడా స్పందించకుండా కుక్కిన పేనల్లే ఉన్నారేంటి చెప్మా !!
ప్రతీ టపా చదివి కామెంట్ వేసే కొంత మంది పెద్దలు , ఈ టపా చదవలేదంటే నేను నమ్మను. మీ టపా నచ్చక పోతే కనీసం ఖండించి ఉండాల్సింది.
ఖండన లేదంటే , వాళ్ళకి ఇదే అభిప్రాయం ఉన్నదని, కాని మన వీరుని తిక్క కి, అర్థం కానీ లెక్క కి భయపడి ఉంటారని అనుకోవాలి.
netiszen గారూ, పోనివ్వండి .. ఎవరి అభిప్రాయం వారిది,
ఎవరికి ఎంత తిక్క వుంటే మనకెందుకండీ మన లెక్క మనం తేల్చేశాము కదా సరిపోయింది :):)
@ Sandeep, Good
Please conclude this issue and stop the extension,
Hi all
మీకో విషయం చెప్పదలచుకున్నాను, సావధానం గా ఆలకించండి,
మనం ఒక అంశాన్ని ప్రతిపాదించం ఇక్కడ, అనవసరం గా అవమానిస్తే లోకం చూస్తూ ఊరుకోదు,
సభ్యత గా వ్యవహరించని పక్షాన ప్రతి ఘటన కూడా అంతే స్థాయిలో ఉంటుంది అని,
మనం ప్రతిఘటించేశాం! its over topic closed
తెలియాల్సిన వాళ్లకు తెలియాల్సినవి తెలిసి ఉంటాయి,
మనం ఎప్పుడు కూడా వ్యక్తి ని విమర్శించకూడదు,
at the same time వ్యక్తిని ప్రశంసించనూ కూడదు,
మనం ఆ వ్యక్తి ద్వారా వ్యక్తమైన పనిని మాత్రమే గుర్తించి గుణ విచారణ చేసి right or wrong అని justice చెప్పాలి న్యాయబద్ధంగా
as comment చేసే వారిగా!
so ఇంకా ఆ issue ని సాగాదీయటం మంచిది కాదేమో ఆలోచించండి,
ఎందుకంటే,,,,
''వాదన లో పస లేనప్పుడే వ్యక్తులు చిందులు తొక్కుతుంటారు'' అని ఒక proverb
కాని మన వాదన లో స్పష్టత ఉండి, న్యాయం ఉంది.
బహిరంగంగా చెప్పాలి అనుకున్నాం,
ముక్త కంటత తో వ్యతిరేకిన్చేశాం !
అయిపొయింది అక్కడితో .....
మనం ఇంకా సాగాతీయం మంచిది కాదు,
ఇక ఇంతటి తో స్వస్తి వచనం చెప్పేద్దాం అని నా ఉద్దేశ్యం
మీరు ఏమంటారు?
@ఎందుకో ఏమో,
Friend ..
మీ కామెంట్ లోని ప్రతి మాటతో నేను ఏకీభవిస్తున్నాను..
నేను నా మనసుకు తప్పు అనిపించింది మీతో పంచుకున్నాను..దానికి మీ అందరి నుండి ఒక మంచి రెస్పాన్స్ రావటం నాకు చాలా సంతోషం!!
"అనవసరం గా అవమానిస్తే లోకం చూస్తూ ఊరుకోదు,
సభ్యత గా వ్యవహరించని పక్షాన ప్రతి ఘటన కూడా అంతే స్థాయిలో ఉంటుంది అని,
మనం ప్రతిఘటించేశాం! its over topic closed"
Friend ... మీ సలహాను ఒప్పుకుని ఈ టాపిక్ గురించి చర్చను ఇంతటితో ఆపుతున్నాను..
ఈ విషయంలో నేను మాట్లాడింది ధర్మమే అన్న మీ అందరికీ ధన్యవాదములతో ......
మీ సందీప్..
Sandeep garu, Netiszen,
తేలుకుట్టిన దొంగల్లా వుండిపోయివుంటారులేండి, వాళ్ళకు ఖండించేత సీన్ లేదులేండి.
ఈ పోస్ట్ మాలికలో కనిపించదే! వాళ్ళూ రాకపోతే లింక్ వాళ్ళ బ్లాగుల్లో పెడితే? ప్రచారం అన్నది లేకపోతే నలుగురికి తెలిసేదెట్లా?
Good job :)
ఆ జానుతెనుగు సొగస్సు వాడో వెధవ, లుచ్చా, లఫంగి --ప్రవీణ్ లాంటి అమాయకుణ్ణి పట్టుకుని రెండు మాణుగుల గ్రాసం పట్టించమన్నాడు. పొద్దున్లేస్తే వాడి ఇంట్లో కోడిపెంట దగ్గర్నించీ తీస్కొచ్చి బ్లాగుల్లో పెట్టే ధూర్తుడు, ఎవడైనా వాడితో కొంచెం విభేదిస్తే చాలు నోరుపెట్టుకు పడిపోతాడు త్రాష్టుడు.
వాణ్ణి తిట్టిన కామెంట్లు పబ్లిష్ చేసుకోడానిక్కూడా దమ్ములేని మ్లేచ్చుడు, వాడిలాంటి పాపాత్ముడు ఈ భూమ్మీద ఉండడమే తప్పు.
ఆ జానుతెనుగు సొగస్సు వాడో వెధవ, లుచ్చా, లఫంగి --ప్రవీణ్ లాంటి అమాయకుణ్ణి పట్టుకుని రెండు మాణుగుల గ్రాసం పట్టించమన్నాడు. పొద్దున్లేస్తే వాడి ఇంట్లో కోడిపెంట దగ్గర్నించీ తీస్కొచ్చి బ్లాగుల్లో పెట్టే ధూర్తుడు, ఎవడైనా వాడితో కొంచెం విభేదిస్తే చాలు నోరుపెట్టుకు పడిపోతాడు త్రాష్టుడు.
వాణ్ణి తిట్టిన కామెంట్లు పబ్లిష్ చేసుకోడానిక్కూడా దమ్ములేని మ్లేచ్చుడు, వాడిలాంటి పాపాత్ముడు ఈ భూమ్మీద ఉండడమే తప్పు.
No name .. బ్లాగర్ గారు.. నేను మీరు పైన చేసిన కామెంట్ ని ఖండిస్తున్నాను. విమర్శ చేయండి. వారు ఏదో అన్నారని మీరు ఇలా నోరు పారేసుకోవడం కూడా బాగో లేదండి.ఇది సంస్కారం అంటారా?చెప్పండి. ఇతరులు చేసిన పని మనం చేస్తే ఇతరులకి,మనకి తేడా ఏముంటుంది చెప్పండి.? బాహ్య పరంగా నాగరికులమై అనాగరికమైన వ్యాఖ్యలు చేయడం వద్దండి. మీరే కాదు..
ఈ క్రింద కామెంట్ చూడండి. ..
జానుతెనుగు సొగసులు లో ఈ కామెంట్. anatenugu.blogspot.in/2012/05/blog-post_12.html
LBS తాడేపల్లి గారి కామెంట్.
మీ బొమ్మలన్నీ చూస్తున్నానండీ. ఒక చిన్నపాటి చిత్రకారుడుగా చెబుతున్నాను, చాలా బావున్నాయి. కానీ బ్లాగ్లోకంలో వీటిని పెట్టడం గేదెల ముందు వేదాలు చదివినట్లు ఉంటుంది. మీరు theme art అలవాటు చేసుకోండి రవివర్మలాగా ! మీరు ఇలాగే చేయితిరిగి కొన్నిసంవత్సరాలలో మీ స్వంత గ్యాలరీ ఏర్పాటు చేయాలని ఆకాంక్షిస్తున్నాను.
ఇలాగునా మనుషులు మాట్లాడేది?
పాపం ఆ పశువుతో మనుషులిని పోల్చడం అసలు బాగోలేదు.
నా సానుభూతి.గేదె మాత(గో మాత ) కి పాలు ఇచ్చి మనకి మేలు చేస్తుంది ఆ పాలు తాగి మనుషులు ఇలాగున మాట్లాడటం.
ఎంత ఘనకీర్తి!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
వనజవనమాలి గారూ ,
"""LBS తాడేపల్లి గారు బ్లాగరే కదా అంటే LBS తాడేపల్లి గారు కూడా గేదే"""
అయినా తెల్లారి లేస్తే ఆ గేదె పాలే కదండీ టీలు,కాఫీలు అంటూ తాగేస్తుంటాము.. ఏదొ కొంచెం గడ్డి తిని మనకు అమృతాన్ని ఇచ్చే గేదె తో మనుషుల్ని పోల్చటం పాపమండీ..
ఇది ఈ సాంప్రదాయక బ్లాగర్లతో ఎప్పట్నుంచో ఉన్నదే. వీళ్ళిలా నోరుపారేసుకుంటారు, మిగతావాళ్ళుమాత్రం వాళ్ళని గౌరవించాలంటారు. వీళ్ళకి గురువు ఈ తా.ల.బా.(న్). వఠ్ఠి భజనప్రియుడు. ఈయనతో విభేదించామంటే నోటికొచ్చిన మాట అనేస్తాడు. రాసే దాంట్లో తప్పులువెదుకుతుంటాడే ఇంకోఆయన మరీఅయనకి ఇలాంటివి తప్పులని తెలీదా? "అయితేమాత్రం ఏం?" అనా వారింకా రంగంలోనికి దిగనిది.
vILLu peddamanushulaa? vILLani respect ceyyaDamamTE aa respect cEsinavaaLLakE avamaanam.
Konta Mandi Untaru Emi matladutunaro Vallake Sariga Teliyadu.. Alanti vallani chusi jaali padali valla meda prema panchali..vanaja garu sandep garu.... evadi range loo vadu alochistadu ante... veelu ante.. hahahaahahaa pandi annaa kaani dog annaa kaani gede anna gaani vaadi range antee haahhahaa antakanna enka ekkuvaa alochincharu...
హమ్మయ్య .. నీ పోస్ట్ వాళ్ళ మనకి ఆ వేణు మోహన్ బొమ్మల గోల తప్పింధయ్య.
కామెంట్‌ను పోస్ట్ చేయండి